తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక తిరుగులేని ఇమేజ్ ని సంపాదించుకున్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్లు - ఫ్లాప్లతో సంబంధం లేకుండా పవర్ స్టార్ సినిమాలన్నీ అదిరిపోయే ఓపెనింగ్ వసూళ్ళని సంపాదించించి పెడతాయి నిర్మాతకి... ఇక సినిమా హిట్ అయితే కాసుల వర్షం, ఫ్లాప్ అయితే, ఏంతో కొంత నష్టం, నిర్మాతకు, పంపినీదారుడికి... ఈ నష్టం కూడా ఇతర స్టార్ హీరోల సినిమాల ఫ్లాప్లతో పోలిస్తే ఏంతో తక్కువ..అయినా, పవర్ స్టార్ తన సత్తా ఏ పాటిదో ఈ యాడాది విడుదల అయిన 'గబ్బర్ సింగ్' తో చాటి చెప్పాడు... 'జల్సా' తరువాత ఒక్క హిట్ కూడా కొట్టని ఈ హీరో, ఆ లోటునంతా, 'గబ్బర్ సింగ్' విజయంతో భర్తీ చేసాడు... ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా, ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, పూరి జగ్గన్నాత్ దర్శకత్వంలో, 'రాంబాబు...' గా, ప్రేక్షకుల ముందుకు ఒచ్చాడు... అయితే, భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. అతి కష్టం మీద 50 రోజులు ఆడగలిగింది.
అయితేనేం, ఇంతకుమునుపు లాగే, పవర్ స్టార్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. కథలు వినిపించడానికి దర్శకులు, సినిమా తియ్యడానికి నిర్మాతలు,ఈ స్టార్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు... అయితే, పవర్ స్టార్ మాత్రం, తన 'జల్సా' దర్శకుడు 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ నే తన తదుపరి దర్శకుడిగా ఎంచుకున్నాడు... టాలీవుడ్ లక్కి లేడి సమంతని తన కధానాయికగా ఎంచుకున్నాడు... ప్రస్తుతం, ఈ చిత్రం షూటింగ్ చెయ్యడానికి లోకేషన్ల వేటలో, దర్శకుడితో కలిసి స్పయిన్ లో ఉన్నాడు.
పవర్ స్టార్...పవన్ తో తరువాతి చిత్రం చెయ్యడానికి ఎంతమంది దర్శక - నిర్మాతలు వేచి ఉన్నా, ప్రస్తుతానికి ఏ ఒక్కరికీ 'గ్రీన్ సిగ్నల్' ఇవ్వలేదు ఈ స్టార్... త్రివిక్రమ్ తో సినిమా పూర్తీ అయ్యేంత వరకు, ఇంకొక సినిమా గురించి, కనీసం ఆలోచించే పరిస్థితుల్లో లేడట పవర్ స్టార్. ఇక పవర్ స్టార్ తో సినిమా చెయ్యాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే అన్నమాట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more