ఎన్నో మంచి సినిమాలకు దర్శకుడిగా చేసి మంచి పేరుతెచ్చుకున్నారు. ఆయన సినిమాలో ఒక్కసారైన హీరోగా నటించాలి అనే కోరిక హీరోలకు ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ దర్శకుడు అంటేనే టాలీవుడ్ , బాలీవుడ్ లో హీరోలు , హీరోయిన్లు భయంతో వణికిపోతున్నారు. ఆ దర్శకుడి నోటి దూలతో చేసిన విమర్శలే ఇప్పుడు ఆయనకు శపంగా మారినట్లు సినీ జనాలు అంటున్నారు.టాలీవుడ్ అగ్ర హీరోల నుండి చిన్న హీరోల దాకా దర్శకుల నుండి లైట్‌బాయ్ దాకా... అందరూ ఆ దర్శకుడి నోటి మాటకు వణికిపోతున్నారట. అంతేకాదు పొద్దున్న నిద్ర లేవగానే దేవుడా ఆ దర్శకుడి నోట నా పేరు రాకుండా చూడు స్వామి అంటూ మొరపెట్టుకుంటున్నారట. ఇంత స్పెషల్ దర్శకుడు ఎవరని తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఫిలింనగర్ షూటింగ్ స్పాట్ కు వెళ్లాల్సిందే.సినిమాల బిజీకన్నా వివాదాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో బిజీబిజీగా ఉండే దర్శకుడు, టాలీవుడ్, బాలీవుడ్, నిర్మాత....గా కూడా చేస్తుంటాడు. ఆయనే "రాం గోపాల్ వర్మ". ప్రస్తుతం వర్మ మాటంటే వణికిపోతున్నారట టాలీవుడ్ జనం. ఏ దర్శకుడితో నటించాలని మీ కల అని అడిగితే... ఏ హీరో, హీరోయిన్ అయినా ముక్త కంఠంతో పలికే పేరు ఆర్.జీ.వి (రాంగోపాల్ వర్మ) అనేవారు.
అంతేకాదు... ఆయన కంటిచూపు తమపై పడితే చాలు, ఆయన నోటి వెంట తమ పేరు పలికితే ఇక తమ జన్మ ధన్యమయినట్లేనని వర్మతో సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసిన స్టార్లు ప్రస్తుతం వర్మ మా పేరు పలుకకుండా చూడు దేవుడా అని వేడుకుంటున్నారట.టాలీవుడ్లో తనకంటూ ఉన్న ఇమేజ్‌ను చెడకొట్టుకుని, అర్ధం పర్ధంలేని కామెంట్లు చేస్తుండే వర్మ డైరెక్షన్లో ఇటీవల చేసిన సినిమాలు తాలూకు పట్టుకున్న బురద ఎంత కడిగినా వదలడంలేదట. ఇక వర్మ చేత పొగిడించుకున్నారా ఇక మీరు సర్వనాశనం అయినట్లే అంటున్నారట కొంతమంది. వర్మ ఇప్పటికే "నేను నా రాక్షసిలో "ఇలియానాను, " బెజవాడ" చిత్రంలో నాగ చైతన్యను, బాలీవుడ్ "డిపార్ట్‌మెంట్" చిత్రంలో నథాలియా కౌర్‌ను పొగడగా ప్రస్తుతం వీరు తమ కెరియర్లలో ఒక్క విజయం కూడా నమోదు చేసుకోలేక అల్లాడిపోతున్నారనీ, వర్మ నోట పొగిడాడంటే ఆ వ్యక్తికి అది శాపమేనంటున్నారు, టాలీవుడ్ సినీజనం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more