అతిలోక సుందరి శ్రీదేవి నట వారసత్వాన్ని వెండితెరకు పరిచయం చేయదా..? పూల రెక్కలు.. తేనె చుక్కలు రంగరించి చేసిన బొమ్మలా వుండే ముగ్ధ మనోహర రూపం తన వారసులని తెరకెక్కించదా..? అందాల నటి కుమార్తెలు వెండితెర భామల్లా ప్రకాశించబోరా..? అవుననే అంటోందీ బ్యూటీ.. జుదాయ్ తర్వాత వెండితెరకు దూరమైన శ్రీదేవి.. బోనీ కపూర్ ని పెళ్లాడి అచ్చమైన గృహిణిలా మారిపోయింది. ముద్దు లొలికే ఇద్దరు పిల్లలకు తల్లయింది. అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలలోనూ, పేజ్ త్రీ సమావేశాలకూ భర్త పిల్లలతో హాజరై తళుక్కున మెరిసి ఆపై మాయమయ్యేది. శ్రీదేవి అభిమానులందరూ ఆమె మళ్లీ నటించాలని, చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ అందాల నటి మాత్రం నటనంటే బోర్ కొట్టేసిందంటోంది. నా నాలుగేళ్ల వయసు నుంచీ నటిస్తున్నాను.. షూటింగ్ లు, స్టూడియోలు, ఇల్లు.. జీవితమంతా ఇలాగే గడిచిపోయింది. నటిగా నేను చేయాల్సిన డ్యూటీ చేశాను.
ఇక గృహిణిగా నా పాత్ర మిగిలి వుంది.. అందుకే పెళ్లి చేసుకుని ఇంటి దాన్నయిపోయాను.. నా పిల్లలకు తల్లిగా వుంటున్నాను అంటోందీ తళుకు తార..సినీ పరిశ్రమలో నెంబర్ వన్ గా నిలదొక్కుకున్న శ్రీదేవి తన పిల్లలను మాత్రం ఇండస్ట్రీలోకి తెచ్చే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టింది. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి అరంగేట్రానికి అంతా రెడీ అయిపోయిందని, నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారనీ ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని తేల్చేసింది శ్రీదేవి.. తన కుమార్తెకు అందంపట్ల ఆసక్తి ఎక్కువనీ.. తనతో పాటూ రెగ్యులర్ గా జిమ్ లకూ, బ్యూటీ పార్లర్ లకూ వస్తూ వుండటం చూసి చాలా మంది సినిమాలో ట్రయల్స్ కోసం చేస్తున్న ప్రయత్నాలుగా భావించారని అంటోంది. డైట్, శారీరక వ్యాయామం పట్ల తాను చాలా ఖచ్చితంగా, జాగ్రత్తగా వుంటానని తన పోలికే తన పిల్లలకూ వచ్చిందన్నది శ్రీదేవి అభిప్రాయం. ఫిట్ నెస్ కోసం వారానికి రెండు సార్లు పిల్లలతో కలసి టెన్నిస్ ఆడటం శ్రీదేవి హాబీ. తనని బలవంతంగా శ్రీదేవే ఫిట్ నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిప్పుతోందన్న వార్తలపై జాహ్నవి కూడా మండిపడింది. అందం పట్ల, ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా వుండటం తప్పా అని ఎదరు ప్రశ్నిస్తోంది. ఇక నటన విషయంపైనా శ్రీదేవి స్పష్టంగానే వుంది. తన పిల్లలు సినిమాల్లో నటించడానికి ఇంకా సమయం వుందని, ఇద్దరూ ప్రస్తుతం స్కూలు చదువుల్లోనే వున్నారని శ్రీదేవి అంటోంది.
చిన్న తనంలో తనకు చదువు అబ్బలేదని ఆ పరిస్థితి తన పిల్లలకి రాకూడదని ఆమె కోరుకుంటోంది. తన పిల్లలిద్దరూ నటన వైపు రారనీ, చదువులు పూర్తవగానే వాళ్లకి పెళ్లిళ్లు చేసి పంపేస్తాననీ శ్రీదేవి అంటోంది. ఇంగ్లీష్, వింగ్లీష్ సినిమా తన రీ ఎంట్రీ సినిమా కాదని, దీనికోసం ప్రత్యేకించి ప్లాన్ చేసిందేమీ లేదని అంటోంది. కుటుంబమే ఆలంబనగా బతికిన మధ్య తరగతి గృహిణి అమెరికాలో ఒంటరిగా పడే పాట్లే ఇంగ్లిష్, వింగ్లీష్ కథాంశమని, స్టోరీ నచ్చడంతో ఒప్పుకున్నాననీ తెలిపింది. సో.. శ్రీదేవి వారసులెవరూ వెండితెరకెక్కరన్నది రూఢీ అయిపోయింది. కానీ తమకి అద్భుతమైన గుర్తింపును, మైలేజీని, పేరు ప్రఖ్యాతులను, డబ్బును ఇచ్చిన సినీ పరిశ్రమను సాధారణంగా ఏ నటులూ వదులుకోరు.. మరి శ్రీదేవి తన పిల్లలను వెండితెరకెక్కనివ్వనన్న మాటకి కట్టుబడి వుంటుందా ? మాట మారుస్తుందా చూద్దాం..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more