ఆపరేషన్ ఆకర్ష్ అంటే తొలుత గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రత్యర్ధి పార్టీల్లోని బలమైన నేతలను తమ వైపు తిప్పుకుని మానసికంగా దెబ్బతీసే వ్యూహాన్ని వైఎస్ఆర్ ప్రధాన ఆయుధంగా ఉపయోగించారు. టీడీపీ నుంచి ఎన్నికైన కోవూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. బాలనాగి రెడ్డిలను చంద్రబాబుపై కత్తులు దూసేలా వ్యూహం రచించి సఫలమయ్యారు. రాజశేఖర్ రెడ్డి అకర్ష్ మంత్రాన్ని ప్రయోగించి ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు పుట్టించారు.
ప్రస్తుతం తండ్రి బాటలో ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. 18మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని కాంగ్రెస్ అధిష్టానానికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. జగన్ తన దృష్టినంతా టీడీపీ వైపు సారించినట్లు తెలుస్తోంది. జగన్ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తూ చంద్రబాబుకు ఝలక్ ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి ఇప్పటికే పలువురిని తనవైపు తిప్పుకొన్న జగన్ మరికొందరిపై వల విసిరేందుకు పథకం సిద్ధం చేసారు.
విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి గద్దెబాబు రావు, తూర్పు గోదావరి నుంచి ఎర్రం నాయుడు వియ్యంకుడు అదిరెడ్డి అప్పారావు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్, పోలవరం టికెట్ అశించిన బంగపడ్డ సింగన్న దొర.. గుంటూరు నుంచి మాకినేని పెదరత్తయ్య, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి నర్సయ్య అదిలాబాద్ నుంచి మాజీ మంత్రి బోడా జనార్ధన్ వంటి సీనియర్ నేతలు ఓవైపు ఉపఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జగన్ ఇప్పటికే మరికొంత మంది నేతలతో మంతనాలు జరిపినట్టు సమాచారం.
ఈ నేపద్యంలోనే వల్లభనేని వంశీ, కడప జిల్లాకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు మైసురారెడ్డి, రాజంపేట టికెట్ ఆశించిన మదన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సీటను మరోమారు అశించిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటురు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణంతో పాటు మరి కొంత మంది జగన్ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
సందట్లో సడేమియాలా కొందరైతే, కొత్తపార్టీ పేరు చెప్పుకుని పదవులు పొందేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వినికిడి. కాగా, ఇప్పటికే ఉద్యమ వేడితో తెలంగాణలో సతమతమవుతోన్న టీడీపీకి సీమాంధ్రలోనూ జగన్ ఫీవర్ పట్టుకుంది. జగన్ ఆకర్ష మంత్రాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more