తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ సోమవారం పాల్గొన్నారు. మళ్లీ తన పార్టీ పున: ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన ప్రాణాలు తీయడానికి పురికొల్పిన నాయకుడు తనను ఏమీ చేయలేక పైలోకాలకు పోయారని నేను అ భిషిక్తుడను.. అభిషిక్తుడిని ముట్టుకుంటే పై లోకాలకు పోతారని బైబిల్‌లో రాసి ఉందని అందుకే నన్ను అంతమొందించాలనుకున్న వారు అనంతలోకాలకు పోయారని పాల్ చెప్పారు. తనను అంతమొందించడానికి ప్రయత్నించిన తన సోదరుడు, మరో నలుగురు వ్యక్తులు హార్ట్ అటాక్‌తో, కిడ్నీ వైఫల్యాలతో పరలోకాలకు పోయారన్నారు.
తన ప్రాణాలు తీయడానికి పురికొల్పిన నాయకుడు కూడా తనను ఏమీ చేయలేక పైలోకాలకు పోయారని వ్యాఖ్యానించారు. తాను పార్టీ స్థాపిస్తే చివరకు తనకు ఓటు హక్కు సైతం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగిన 148 దేశాల్లో ఎక్కడా ఇంత ఫ్రాడ్ చూడలేదని మండిపడ్డారు. తనకు దైవానుగ్రం ఉందని, ప్రస్తుత సమాజంలో అవినీతి పెచ్చరిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో ఉద్యమిస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీని పునరుద్ధరించి ముందుకు సాగుతూ అవినీతిపై ఉద్యమిస్తానని చెప్పారు.
అయితే కె.ఏ. పాల్ వైయస్సార్ ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని, కాంగ్రెస్ పార్టే పాల్ తో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని, వాళ్ళ అండతోనే మళ్ళీ పార్టీని పునరుద్దరించాడని, క్రిస్టియిన్ ఓట్లను లాక్కోవడానికి కాంగ్రెస్ వేసిన పథకమే ఇదని వైయస్సార్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more