Jaya prada azam khan war turns ugly

Jaya Prada, Azam Khan war turns ugly,Jaya Prada slams Azam Khan,amajwadi Party president Mulayam Singh,Azam Khan from Rampur Assembly,Actress turned MP Jaya Prada

Jaya Prada, Azam Khan war turns ugly

Jaya Prada.gif

Posted: 02/16/2012 05:25 PM IST
Jaya prada azam khan war turns ugly

Jaya Prada, Azam Khan war turns ugly

చలన చిత్ర సీమాలో ఒక వెలుగు వెలిగిన నటి జయప్రద. తన అందం, అభినయంతో, తెలుగు ప్రజల గుండెళ్లో నిలిచిపోయింది. వెండి తెర నుండి తప్పుకున్న తరువాత నందమూరి తారక రామారావు ఆహ్వానముంతో 1994 అక్టోబర్ 10న తెలుగుదేశం పార్టీ లో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత జయప్రద చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశ పార్టీ యొక్క మహిళా విభాగమునకు అధ్యక్షురాలైంది. 1996 ఏప్రీల్ లో తెలుగుదేశం పార్టీ తరుపున రాజ్యసభకు ఎన్నికైంది. అ తరువాత కొన్ని గొడవల కారణం తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైంది.

జయప్రద రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసే విషయంలో ఎస్పీ ముస్లిం ముఖం అయిన అజంఖాన్ తో గొడవలయ్యాయి. పార్టీ అధినేత ములాయంసింగ్ తప్పనిసరి పరిస్థితుల్లో అమర్ సింగ్ వైపు మొగ్గాల్సి వచ్చింది. అజం ఖాన్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తరువాత పార్టీ అఖిలేస్ చేతుల్లోకి వచ్చాక క్రమంగా అమర్ సింగ్ ప్రాభవం కోల్పోయారు. ఆ విధంగా ఎస్పీలో అమర్ కథ ముగిసింది.

అయితే జయప్రదకు పోటీ అజంఖాన్ ఉన్నాడు. అమర్ సింగ్ వెంటే ఉన్న సమాజ్ వాదీ లోక్ సభ సభ్యురాలు జయప్రదకు యూపీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఆర్ఎల్ఎంకు ఆమె ఉపాధ్యక్షురాలు. స్థానికురాలు కాకపోయినా జయప్రదను రాంపూర్ లోక్ సభ నియోజక వర్గ ప్రజలు వరుసగా రెండు సార్లు గెలిపించారు. అయితే రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బద్ద శత్రువు అజంఖాన్ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన్ను ఓడించడాన్ని జయప్రద ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో అమర్ సింగ్ కంటే జయప్రదకే జనాదరణ బాగుండటంతో ఆమెనే ముందు నిలబెట్టి ప్రచారం చేశారు.

మంచి వక్త అయిన అజంఖాన్ కు నోటి దురుసుతనం ఎక్కువే. దీనివల్ల గతంలో అనేకసార్లు దెబ్బతిన్నారు. తాజాగా కాంగ్రెస్ను హిజ్రాల పార్టీగా అభివర్ణించారు. రాంపూర్ లో విజయం అమర్ సింగ్ , జయప్రదలపై ప్రతీకారంగా ఆయన భావిస్తున్నారు. జయప్రద కూడా ఆయన్ను ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Genelia political entry
Nehrus phulpur become the playing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more