Arya's Captain gets an U/A certificate ఆర్య ‘కెప్టెన్’ మూవీ సెన్సార్ పూర్తి.. చిత్ర నిడివిపై విస్మయం..

Arya s captain gets an u a certificate having locked a crisp run time

Arya captain, arya, Aishwarya Lekshmi, captain, u/a certificate, shakthi soundar rajan, Censor Board, U/A certificate, Simran, Aishwarya Lekshmi, Harish Uthaman, Kavya Shetty, kollywood, Movies, Entertainment

Director Shakthi Soundar Rajan and Arya's upcoming film titled 'Captain' is all set to hit the screens on September 8, 2022. Red Giant Movies has acquired the theatrical rights of 'Captain' in Tamil Nadu, and the latest is that the film has been cleared by the Censor Board with an U/A certificate.

ఆర్య ‘కెప్టెన్’ మూవీ సెన్సార్ పూర్తి.. చిత్ర నిడివిపై విస్మయం..

Posted: 09/02/2022 05:10 PM IST
Arya s captain gets an u a certificate having locked a crisp run time

త‌మిళ హీరో ఆర్య‌ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. ‘వ‌రుడు’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో ఆర్య మెప్పించాడు. అప్ప‌టినుండి ఈయ‌న న‌టించిన సినిమాలు కొన్ని యూట్యూబ్‌లో డ‌బ్బింగ్‌ వెర్ష‌న్‌లుగా విడుద‌ల కాగా మ‌రికొన్ని నేరుగా థియేటర్ల‌లో విడుద‌లయ్యాయి. ప్ర‌స్తుతం ఈయ‌న తెలుగులో మార్కెట్ పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. ఇక చాలా కాలం త‌ర్వాత ఈయ‌న ‘సార్ప‌ట్ట ప‌రంప‌ర‌తో’ మంచి కంబ్యాక్ ఇచ్చాడు.

గ‌తేడాది నేరుగా ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ‘కెప్టెన్’ విడుద‌లకు సిద్ధంగా ఉంది. శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప‌నులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ స‌ర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైం 1 గంట‌ల 56 నిమిషాలుగా ఉండ‌నుంది. ఈ మ‌ధ్య కాలంలో ఇంత త‌క్కువ ర‌న్ రేట్‌తో ఏ మీడియం రేంజ్ సినిమా కూడా రాలేదు.

శ‌త్రుదేశాలు మ‌న ఆర్మీ సైన్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఏలియ‌న్స్ లాంటి జీవుల‌ను ఇక్క‌డ‌కి పంపిస్తారు. ఈ ఏలియ‌న్స్‌ను ఆర్య టీమ్ ఎలా అంత‌మొందించింది అనే నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో ఆర్య అర్మీ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్ కీల‌క‌పాత్రలో న‌టించింది. ఆర్య‌కు జోడీగా ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌గా న‌టించింది న‌టించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 8న విడుదల‌ కానుంది. థింక్ స్టూడీయోస్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles