Politicians, movie stars pour their birthday wishes on Pawan Kalyan పవన్ కల్యాణ్ కు సినీ, రాజకీయ ప్రముఖల నుంచి శుభాకాంక్షల వెల్లువ

Hbd pawan kalya politicians movie stars pour their birthday wishes on power star

Pawan Kalyan, Janasena, politicians, chandrababu naidu, nara lokesh, raghurama krishnaraju, chiranjeevi, nagababu, mahesh babu, allu arjun, Varun Tej, Sharwanand, Srikanth, Rajasekhar, Nithin, Ravi Teja, Sai Dharam Tej, Rakul Preet, srinu vaitla, naga vamshi, tollywood, movies, entertainment

Pawan Kalyan turned 51 today, September 2. On this special day, social media is filled with wishes from friends, family members, and fans. Allu Arjun, Mahesh babu, Varun Tej, Sharwanand, Srikanth, Rajasekhar, Nithin, Ravi Teja, Sai Dharam Tej, Rakul Preet and several other stars took to social media to wish him.

పవన్ కల్యాణ్ కు సినీ, రాజకీయ ప్రముఖల నుంచి శుభాకాంక్షల వెల్లువ

Posted: 09/02/2022 03:03 PM IST
Hbd pawan kalya politicians movie stars pour their birthday wishes on power star

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ జన్మదిన వేడుక‌లు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఘ‌నంగా జరుగుతున్నాయి. గ‌త రాత్రి నుండి ఫ్యాన్స్ కేక్స్ క‌ట్ చేస్తూ తమ అభిమాన నటుడి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. అటు పవర్ స్టార్ గా సినీప్రేక్షకులలో చెరగని ముద్రవేసిన ఆయన.. ఇటు జనసేన పార్టీని స్థాపించి రాజీకీయంగా కూడా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత మళ్లీ ఎన్నికలకు ఐదేళ్ల సమయం ఉండటంతో సినిమాలకు పచ్చజెండా ఊపారు. కాగా, ఇవాళ పవర్ స్టార్, జనసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ 51వ పడిలోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, నారా లోకేశ్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్ర‌మంలో అటు సినీ ప్ర‌ముఖులు, ఇటు రాజ‌కీయ నాయ‌కుల నుండి బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. లాంగ్ లివ్ పవన్ కల్యాణ్ అంటూ అభిమానులు నినదిస్తున్నారు. ప్రజా మద్దతు కూడగట్టుకుని మరింత ఉద్దృతంగా రాజకీయాల్లో దూసుకెళ్లాలంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పోస్ట‌ర్‌లకు పాలాభిషేకాలు చేస్తూ విషెస్‌ను తెలియాజేస్తున్నారు. తాజాగా సినీ న‌టుడు చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ట్విట్ట‌ర్లో బ‌ర్త్‌డే విషెస్‌ను తెలిపాడు.

చిరంజీవి ‘త‌న ఆశ‌, ఆశ‌యం ఎల్ల‌ప్పుడూ జ‌న‌హిత‌మే. తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్త శుద్ధితో శ్ర‌మించే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశ‌యాల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటూ, ఆశీర్వ‌దిస్తూ, క‌ల్యాణ్ బాబుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ‘నా గురువు, నా బ‌లం ప‌వ‌న్ కళ్యాణ్ మామకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ప్రేమ‌, ఆరోగ్యం మ‌రియు ఆనందంతో ప్రతిరంగంలో రాణించాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.


బండ్ల గ‌ణేష్ ‘ఈ విశ్వంలో సూర్యుడు ఒక్క‌డే, చంద్రుడు ఒక్క‌డే ప‌వ‌న్ ఈశ్వ‌రుడు ఒక్క‌డే. మా దేవ‌ర‌కు జన్మ‌దిన శుభాకాంక్ష‌లు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈయ‌న‌తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, వరుణ్ తేజ్, రవితేజ, నవదీప్, యంగ్ హీరోలు నితిన్‌, రామ్ పోతినేని, శర్వానంద్, మంచు మనోజ్, సినీగేయ రచయిత రామజోగయ్యశాస్త్రీ, కమేడియన్ వెన్నెల కిషోర్, నాగ‌వంశీ, శ్రీనువైట్ల, హను రాఘవపూడి ఇలా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు బర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ బర్తడే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి పోస్టర్, బర్త్ డే గ్లింప్స్ వీడియోలు విడుదలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  politicians  movie stars  celebrities  chiranjeevi  nagababu  chandrababu  naga vamshi  tollywood  

Other Articles