Varun Sandesh's new film gets an interesting title వ‌రుణ్ సందేశ్‌ కొత్త చిత్రం.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్

Varun sandesh s next titled yadhbhavam thadhbhavathi

Varun Sandesh, Yadbhaavam Tadbhavati, First Look, Sandeep kishan, Inaya Sultana,Ramesh Jakkala, MIhiRaamsh, Prasanna Lakshmi Bhoomi, Tollywood, Movies, Entertainment

On the occasion of Varun Sandesh’s birthday, a powerful title Yadhbhavam Thadhbhavathi is locked for the movie.. Yadhbhavam Thadhbhavathi. Sundeep Kishan has unleashed the first lookThe first look presents Varun Sandesh in a massy and rugged look. Inaya Sultana is the leading lady in the movie. The film’s shoot is nearing completion.

సరికొత్త కాన్సెప్ట్ తో వ‌రుణ్ సందేశ్‌ కొత్త చిత్రం.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్

Posted: 07/21/2022 03:37 PM IST
Varun sandesh s next titled yadhbhavam thadhbhavathi

‘హ్య‌పీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వ‌రుణ్ సందేశ్‌. కానీ అదే జోష్‌ను త‌రువాత సినిమాల్లో కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. ఈ చిత్రాల తరువాత ఆయన నటించిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తరువాత వ‌రుస ఫ్లాప్‌లు వెంటాడటంతో మ‌ధ్య‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌లు సినిమాల్లో న‌టించాడు. కానీ అవి కూడా వ‌రుణ్ కెరీర్‌కు పెద్ద‌గా ప్ల‌స్ కాలేదు. దాంతో ఎక్కడ పడేసుకున్నాడో అక్కడే వెతకాలని నిర్ణయించుకున్నాడు.

టాలీవుడ్ లోకి తిరిగి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ సినిమా ‘ఇందువ‌ద‌న’ కూడా ఫ్లాప్‌గా మిగిలింది. ఇది కూడా వరుణ్ కు నిరాశనే మిగిల్చింది. దీంతో వ‌రుణ్ సందేశ్‌ ఈ సారి రూటు మార్చి.. విభిన్న క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మయ్యాడు. తాజాగా ఈయ‌న కొత్త సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్ రిలీజ్ అయ్యింది. ర‌మేష్ జ‌క్కాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ సందేశ్‌ ‘య‌ద్భావం తద్భ‌వ‌తి’ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు.

ఇక ఇవాళ వ‌రుణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. లేటెస్ట్‌గా విడుద‌లైన‌ పోస్ట‌ర్‌లో వ‌రుణ్ క‌ళ్ళ‌కు కూలింగ్ గ్లాసెస్ ధ‌రించి నోట్లో సిగ‌రెట్ కాల్చూతూ.. చేతి సంకెళ్ళ‌ను తెంచుకుని గ‌న్‌తో ఫైరింగ్ చేస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతుంది. ఇక‌ ఈ సారి స‌రికొత్త క్యారెక్ట‌ర్‌తో వ‌రుణ్  ప్రేక్ష‌కులు ముందుకు రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. దీనితో పాటు సందీప్ కిష‌న్-విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మైఖేల్ సినిమాలో వ‌రుణ్ సందేశ్‌  కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles