దక్షిణాదిన అగ్రనటిగా కొనసాగిన అనుష్క.. టాలీవుడ్ లో తనకు ఎదురులేని అభిమానగణాన్ని ఏర్పర్చుకుంది. అలాంటి ఈ నటి గత కొంతకాలంగా తన జోరును పూర్తిగా తగ్గించింది. దశాబ్ధ కాలం పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. అయితే అనుష్క ఈ మధ్య సినిమాల జోరు తగ్గించింది. 2020లో వచ్చిన ‘నిశ్శబ్ధం’ తర్వాత ఇప్పటివరకు ఈమె నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఈమె నవీన్ పొలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా సెట్స్‌పైన ఉండగానే అనుష్క మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క తాజాగా మరో సినిమాకు సైన్ చేసిందట. ప్రముఖ దర్శకుడు, అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్ విజయ్‌తో స్వీటీ తన తదుపరి సినిమాను చేయబోతుందట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయిని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా బహుభాషా చిత్రంగా తెరకెక్కనుందట. ఇక ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్లు టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అనుష్క ప్రస్తుతం మలయాళంలో సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒట్టక్కొంబన్‌లో కీలకపాత్ర పోషిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more