'Surapanam Kick and Fun': Teaser released ’సురాపానం కిక్ అండ్ ఫన్’ టీజ‌ర్‌ విడుదల..

Surapanam kick and fun teaser filled with thrills and entertainment

Surapanam kick and fun, Official Teaser, Sampath Kumar, Pragya Nayan, Ajay Ghosh, Bheems Ceciroleo, Matta Madhu, Tollywood, Movies, Entertainment

'Surapanam', directed by Sampath Kumar, is a fantasy thriller and complete comedy entertainer. Producer Madhu Yadav today unveiled its teaser. Sampath Kumar and Pragya Nayan are the lead pair. The teaser was released at the hands of director Saagar K Chandra, who said that its content is in keeping with the title and its caption, 'Kick And Fun'. "I am sure the audience will be entertained. 'Surapanam'.

’సురాపానం కిక్ అండ్ ఫన్’ టీజ‌ర్‌ విడుదల.. థ్రిల్‌తోపాటు వినోదం..

Posted: 04/22/2022 08:28 PM IST
Surapanam kick and fun teaser filled with thrills and entertainment

అఖిల్ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై సంపత్ కుమార్ దర్శకత్వం వహిస్తూ..నటించిన చిత్రం సురాపానం ( కిక్ అండ్ ఫన్). ఈ సినిమా టీజ‌ర్‌ను ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర లాంఛ్‌ చేశారు. ఈ సందర్బంగా సాగర్ కె చంద్ర మాట్లాడుతూ..సురాపానం..కిక్ అండ్ ఫన్ టైటిల్‌కు తగ్గట్టుగా టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుని, మంచి థ్రిల్ తో పాటు వినోదాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. సురాపానం ( కిక్ అండ్ ఫన్ ) సినిమా ఫాంటసీ థ్రిల్లర్. కంప్లీట్ కామెడి ఎంటర్టైనర్ అని తెలిపారు.

తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై మొదటి సారిగా సరికొత్త కథాంశంతో వస్తున్న సురాపానం సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సార్ లో ఉన్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంపత్ కుమార్ , ప్రగ్యా నయన్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించగా.. ప్రధాన పాత్రలలో అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, సురభి ప్రభావతి, త్రిపుర తదితరులు నటించినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles