Akshay Kumar steps down as tobacco brand ambassador ‘నన్ను క్షమించండీ’’ అభిమానులకు బాలీవుడ్ హీరో నోట్..

Akshay kumar apologises to fans after pan masala brand backlash steps back as ambassador

akshay kumar, akshay kumar pan masala ad, akshay kumar vimal ad, akshay kumar ads, ajay devgn, shah rukh khan,vimal, vimal pan masala, akshay kumar vimal pan masala, ajay devgn, shah rukh khan, akshay kumar apologises, Bollywood, Movies, Entertainment

After receiving backlash for promoting a pan masala brand, actor Akshay Kumar announced that he has stepped back as ambassador. At midnight, the actor took to Twitter and apologised to his fans saying that he would be more cautious about the brands that he endorses in the future.

‘నన్ను క్షమించండీ’’ అభిమానులకు బాలీవుడ్ హీరో నోట్..

Posted: 04/21/2022 12:52 PM IST
Akshay kumar apologises to fans after pan masala brand backlash steps back as ambassador

బాలీవుడ్ అగ్రనటులలొ ఒకరిగా వెలుగొందుతున్న ఓ స్టార్ హీరోకు నెటిజనులు ఇచ్చిన షాక్ గట్టిగానే తగిలింది. దీంతో ఆయన దెబ్బకు దిగివచ్చి.. తనను క్షమించాలంటూ వేడుకోవాల్సి వచ్చింది. ఔనా.. నిజమేనా.. అంటే ముమ్మాటికీ నిజం. ఇంతకీ ఎవరా హీరో.. విమర్శలకు దిగివచ్చి.. క్షమించాలని కోరడం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ అలా దిగివచ్చిన హీరో ఎవరు అంటే ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అయితే అయనకు దిగిరావాల్సిన తప్పని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎందకు అన్న వివరాల్లోకి వెళ్తే..

పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అదేంటి ఇప్పటికే బాలీవుడ్ అగ్రతారలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ సహా మరికోందరు పోగాకు ఉత్పత్తులకు ప్రచారకర్తలు వ్యవహరిస్తున్నారు కదా అంటే.. అయితే ఇక్కడే ఓక మెలిక ఉంది. గతంలో ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు పోగాకు ఉత్పత్తులకు బ్రాండ్‌కు అంబాసిడర్ వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ఒక్కేవ్యక్తి ఒకప్పుడు అలా చెప్పి.. తాజాగా ఇలా చేయడంపై కస్సుబస్సు మంటున్నారు.

అభిమానుల అగ్రహానికి దిగివచ్చిన అక్షయ్ కుమార్ ఇకపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండబోనని ప్రకటించాడు. అంతేకాదు, ప్రజల ప్రాణాలను హరించే ఉత్పత్తులకు ప్రచారం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ఈ మేరకు గత రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనను అభిమానులు, ప్రజలు క్షమించాలని కోరుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ విడుదల చేశాడు. ‘‘నన్ను క్షమించండి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతిస్పందన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇకపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవించి తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను’’ అని ఆ నోట్‌లో పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles