Megastar Chiranjeevi Changed His Twitter Handle తన ట్విట్టర్ ఖాతా పేరును మార్చేసిన మెగాస్టార్ చిరంజీవి

Megastar chiranjeevi changed his twitter handle as acharya

Megastar Chiranjeevi, K Chiru, Chiranjeevi, Acharya, Twitter handle name, Hanuman Jayanthi, social media, Ram Charan Video, chiru video post, viral video, Tollywood, Movies, Entertainment

Megastar Chiranjeevi has changed his Twitter handle name. Yes! What you read is right! He changed his Twitter name to Acharya. Today on the occasion of Hanuman Jayanthi, Megastar Chiranjeevi shared a lovely video on his social media handle.

తన ట్విట్టర్ ఖాతా పేరును మార్చేసిన మెగాస్టార్ చిరంజీవి

Posted: 04/16/2022 05:07 PM IST
Megastar chiranjeevi changed his twitter handle as acharya

మెగాస్టార్ చిరంజీవిని కొరటాల శివ ‘ఆచార్య’గా మార్చేశారు. అదేంటి అంతకుముందు అనేక సినిమాలు చేసినా పెద్దగా చిత్రాలకు సంబంధించిన పేర్లను తన నిజ జీవితంలోకి తీసుకురాని చిరంజీవి.. ఈ సారి మాత్రం తన చిత్రం పేరును తన వ్యక్తిగత జీవితంలోకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ను కూడా తాజాగా మర్చేశారు. తన ట్విట్టర్ ఖాతా పేరును ‘ఆచార్య’గా మార్చుకున్నారు. ఇకపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఖాతా ఆచార్య ’ కె చిరు ట్వీట్స్ గా ఆయన మార్చుకున్నారు.

అయితే తన ట్విట్టర్ ఖాతాను సినిమా పేరును ఆయన జోడించడంలో తొలిసారి. ఇది సినిమా ప్రమోషన్ కోసమేనా అనికూడా అడిగేవాళ్లు ఉన్నారు. అయితే చిరంజీవి సినిమా అంటే దక్షిణాధిలో ఒక పండగ వాతావరణం అలుముకోవడం సహజం. అలాంటి మోగాస్టార్ తన చిత్రం ప్రమోసన్స్ కోసం ఇలా చేశాడంటే నమ్మశక్యంగా లేదని సినీవిశ్లేషకులు అంటున్నారు. అయితే తనకు ఈ పేరు బాగా నచ్చడంతోనే ఆయన ఇలా చేశారని అభిమానులు పేర్కోంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ తన కుమారుడు రామ్ చరణ్ కు సంబంధించి మనసుకు హత్తుకునే ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

చిరంజీవికి స్వతహాగా హనుమంతుడంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. ఇవాళ హనుమ జన్మదినం పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. ఆ వీడియోను అందరితోనూ పంచుకున్నారు. కాటేజీలో మేకప్ వేసుకుంటూ రామ్ చరణ్ రెడీ అవుతుండగా.. హనుమ ప్రతిరూపమైన ఓ వానరం అక్కడకు వచ్చింది. మేకప్ వేసుకున్నంత సేపు అక్కడే తారాడింది. మేకప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత చరణ్.. ఆ వానరానికి బిస్కెట్లను అందించాడు. ఆ వీడియోకు హనుమ శ్లోకమైన ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ను బ్యాగ్రాండ్ గా చిరంజీవి పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles