RRR box office collection Day 3 grosses Rs 500 crore ఇండియన్ సినిమాలో చరిత్రను సృష్టించిన ఆర్ఆర్ఆర్ కలక్షన్లు

Rrr box office collection day 3 ss rajamouli film grosses over rs 500 crore worldwide

rrr earning, rrr box office, rrr box office collection, rrr box office day 3, rrr collection, rrr total collection, rrr international collection, RRR 3 day collections, Jr NTR, Ram Charan, Alluri sitaramaraju, ss rajamouli, rrr release date, rrr March 25th 2022, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Ajay devgn, Alia Bhatt, MM keeravani, Tollywood, Entertainment, movies

SS Rajamouli’s magnum opus RRR has received a unanimous thumbs up from the audience and film critics. Starring Jr NTR and Ram Charan in the lead roles, the film has already brought a ‘tsunami’ at the ticket windows. As per trade analyst Ramesh bala, RRR has grossed more than Rs 500 crore on the worldwide box office on opening weekend.

ఆర్ఆర్ఆర్: ఇండియన్ సినిమాలో చరిత్రను సృష్టించిన కలక్షన్లు

Posted: 03/28/2022 05:37 PM IST
Rrr box office collection day 3 ss rajamouli film grosses over rs 500 crore worldwide

ఆర్‌ఆర్‌ఆర్‌.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలయ్యేవరకు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసేలా చేసిన చిత్రబృందం.. అభిమానులను నాలుగేళ్ల పాటు నిరీక్షింపజేసి.. మార్చి25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ల‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు న‌టించారు.

డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ఇక అభిమానులు ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్ లో ఎంత మేరకు వసూళ్లు రాబట్టిందన్న విషయమై ప్రతీ రోజు నెట్టింట్లో వెతకడం.. ఆ తరువాత వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి తమ స్నేహితులు, గ్రూపుల్లో పంచుకోవడం 25 నుంచి ప్రతీరోజు జరుగుతూనే వుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది? అని స్టార్ట్ చేసిన అభిమానులు. ఇక తొలి వారంతంలో ఎంత మేర వసూళ్లు రాబట్టింది కూడా బాగానే వెతుకుతున్నారు.

ఇక అభిమానుల ఉత్కంఠ నేపథ్యంలో సినీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ కూడా వారిని ఎక్కువగా వెయిట్ చేయంచకుండా వారికి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూనే వున్నాడు. ఇక ఇవాళ అభిమానులు వెతుకుతున్న సమాచారాన్ని ఆయన అందించారు. ఓపెనింగ్ వీకెండ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొ్టిందని మునుపెన్నడూ లేని విధంగా మూడు రోజుల్లో ఏకంగా రూ. 500 కోట్ల రూపాయల మేర వసూలు చేసిందని అన్నారు. ఇక బాలీవుడ్ సహా ఉత్తరభారతంలో శుక్రవారం కన్నా శనివారం నుంచి కలెక్షన్లు పెరిగాయని అన్నారు. ఆదివారం రోజున రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిందని అన్నారు.  

రిలీజ్‌కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం కలెక్షన్లలో సునామి సృష్టించింది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఒక్క నైజాం ఏరియాలోనే క‌లెక్ష‌న్లప‌రంగా స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాస్తూ సరికొత్త రికార్డులను సృష్టించింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు 120.19కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇకతొలి రోజే రూ.223కోట్లు సాధించి 'బాహుబలి' రికార్డులను అధిగమించిన ఈ మూవీ మూడు రోజులు పూర్తయ్యేసరికి సరికొత్త బెంచ్​మార్క్​ను సెట్​ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్ల వసూళ్లను సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Ram Charan  SS Rajamouli  Ajay devgn  Alia Bhatt  Oliva morris  MM keeravani  Dvv Danaiah  Tollywood  

Other Articles