‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత మే 27న ఎఫ్ 3ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించింది. ఇక నేడు హోలీ పండగ సందర్భంగా ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చింది ఎఫ్ 3 టీం. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ పేజీలో ఈ మూవీ అప్‌డేట్ ఇస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్.
ఈ సినిమాలోని నటీనటుల నవ్వులను పంచుతూ ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫ్రస్ట్రేషన్ లేని ఫన్‌తో ఈ వీడియోలో నటీనటులు కనిపించడంతో బాగా ఆకట్టుకుంటుందో. ఫస్ట్ హీరో వెంకటేశ్‌తో స్టార్ అయిన ఈ వీడియో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, నటి ప్రగతి, సునీల్, ఆలీ ఇలా అందరూ నవ్వులు పూయిస్తూ కనిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం టీంలో సందడి చేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు, ప్రేక్షకులు చాలా బాగుందని మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమా చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
#F3Movie Family wishes you all a very Happy & Safe Holi ️
— Sri Venkateswara Creations (@SVC_official) March 18, 2022
May the festival of colours fill your lives with lots of happiness #HappyHoli@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP @adityamusic @SVC_official @f3_movie #F3OnMay27 pic.twitter.com/hlp7aGGrUz
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more