Ram Charan's Help to his Ukraine Bodyguard ఉక్రెయిన్‌ బాడీగార్డుకు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ సాయం

Ram charan s help to his ukraine bodyguard

Ram Charan, NTR, Ukraine Body guard, Rusty, fighting for country, Rajamouli, RRR, Ukraine-Russia war, Naattu Naattu, Naattu Naattu song shooting, Heritage place, Cinema, March 25th, Tollywood, movies, Entertainment

Mega power star Hero Ram Charan revealed some information. Charan gave money to one of his bodyguards who looked after him when the movie was being made in Ukraine. "I spoke to the individual who provided protection to me," Charan said of the situation.

ఉక్రెయిన్‌ బాడీగార్డుకు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ సాయం

Posted: 03/18/2022 04:59 PM IST
Ram charan s help to his ukraine bodyguard

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరోమారు తన దయార్థ హృదయాన్ని చాటుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్దం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తరపున పోరాడుతున్న ఓ సైనికుడికి రామ్ చరణ్ కొంత డబ్బుతో పాటు మందులు, పలు సామాగ్రిని సాయంగా అందించారు. అదేంటి ఎంతోమంది ఉక్రెయన్ సైనికులతో పాటు దేశపౌరులు కూడా తుపాకులు పట్టుకుని తమ దేశం కోసం ప్రాణాలను పన్నంగా పెట్టి పోరాడుతున్నారు. అయినా.. ఒక్క సైనికుడికే హీరో రాంచరణ్ సాయం చేయడమేంటి అంటరా.? అక్కడికే వస్తున్నాం.

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ ఉక్రెయిన్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ షూటింగ్‌ జరిగిన సమయంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు రస్టీ అనే ఉక్రెయిన్‌ బాడీగార్డుగా వ్యవహరించాడు. ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పుట్టినగడ్డను కాపాడుకోవడానికి అతడు సైనికుడిగా మారాడు. అతడే కాదు, 80 ఏళ్ల అతడి తండ్రి కూడా గన్‌ పట్టుకుని యుద్ధంలో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో కష్టాలతో సతమతమవుతున్న రస్టీకి ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు రామ్‌చరణ్‌. చెర్రీ పంపిన డబ్బులతో అతడు నిత్యావసర వస్తువులు, మెడిసిన్‌ కొనుగోలు చేశాడు.

ఈ సందర్భంగా హీరోకు కృతజ్ఞతలు తెలుపుతూ రస్టీ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అతడు మాట్లాడుతూ.. 'నా పేరు రస్టీ, ఉక్రెయిన్‌ నా స్వస్థలం. కీవ్‌లో షూటింగ్‌ జరిగినప్పుడు రామ్ చరణ్‌కు బాడీగార్డుగా పని చేశాను. రష్యా రాకెట్‌ దాడుల్లో సామాన్య పౌరులు చనిపోతున్నారు. ఈ విషయం తెలిసి రామ్‌చరణ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎలా ఉన్నారు? కుటుంబం క్షేమంగా ఉందా? అని అడిగారు. ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పారు. అలాగే డబ్బులు పంపించారు. దానితో నా భార్యకు మందులు తీసుకున్నాను. థ్యాంక్‌యూ రామ్‌చరణ్‌' అని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles