'Sebastian P.C. 524' locks date to take charge విడుదల తేదీని లాక్ చేసుకున్న ‘సెబాస్టియన్ పిసి 524’

Kiran abbavaram s cop drama sebastian p c 524 gets a new release date

Kiran Abbavaram, Sebastian PC 524, Sebastian PC 524 Release Date, Kiran Abbavaram's Sebastian PC 524 Release Date, Namratha Darekar, Komali Prasad, Balaji Sayyapureddy, Ghibran, Jovitha Cinemas, Srikanth Iyyangar, Surya, Rohini, Adarsh Balakrishna, Surya, Mahesh Vitta, Ravi Teja, Tollywood, Movies, Entertainment

The makers of Sebastian P.C. 524, starring SR Kalyanamandapam actor Kiran Abbavaram, have announced a new release date. The upcoming thriller has now been moved to March 4. The film was to hit theatres on February 25 earlier. To confirm the news, the makers have also released a brand-new poster of the film. Sebastian P.C. 524 stars Kiran Abbavaram as a rookie cop.

విడుదల తేదీని లాక్ చేసుకున్న ‘సెబాస్టియన్ పిసి 524’

Posted: 02/21/2022 07:39 PM IST
Kiran abbavaram s cop drama sebastian p c 524 gets a new release date

‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన రెండోచిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’తో కూడా మరో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్న ఈ యువ హీరో... క్లాసు-మాసు, యూత్‌- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ‘సెబాస్టియన్‌ పి.సి524’తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటన చేసింది.

జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్ టైన్మెంట్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) జంటగా నటించారు. సెబాస్టియన్ చిత్రానికి సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలు కాగా... బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, 'సెబాస్టియన్ పి.సి524' చిత్రం రేచీకటి కాన్సెప్టుతో తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమా కథాంశం.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. కిరణ్‌ అబ్బవరంకు ‘సెబాస్టియన్‌ పి.సి524’ కచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా "హెలి"అనే పాటకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉందని తెలిపారు. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన వస్తోందని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles