పాన్ ఇండియా హీరో. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాలతో సాహో చిత్రంలో తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నాడు. ఇకపై ఆయనను టాలీవుడ్ స్టార్‌గా పేర్కోనలేని స్థాయిని అందుకున్నాడు. తన సినిమాలతో అభిమానులకు విందు భోజనం వడ్డించేందుక కూడా సిద్దమయ్యాడు. ఒకే వరుసలో ఏకంగా మూడు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రాధేశ్యామ్, అదిపురుష్, సలార్, సినిమాలతో పాటు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోనూ నటిస్తున్నారు. కాగా తన చిత్రాల షూటింగ్లో పాల్గొనే కోస్టార్స్.. అందులోనూ సీనియర్ నటులతో ఆయన ఎలా వ్యవహరిస్తారన్న అసక్తి సర్వత్రా నెలకొంటుంది.
ఈ క్రమంలోనే ఇదివరకే పలు సందర్బాలలో ఆయన తొటి నటులపై ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటారని ఇప్పటికే తెలిసిన విషయమే. తాను బోజనం చేయడంతో పాటు సహచర నటులకు, ఇతర సిబ్బందికి కూడా ఆయన బోజనం పెట్టడంతో పాటు ప్రేమగా వడ్డిస్తాడన్న విషయం ఇప్పటికే పలువురు వెల్లడించారు. ప్రభాస్ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్కు కూడా ఇంటి రుచులను రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్‌కు విందు భోజనం వడ్డించాడు. ఇప్పుడు మరో బిగ్ స్టార్‌కు ప్రభాస్ ఆతిథ్యం అందించాడు.
ప్రస్తుతం ప్రభాస్ 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. తనతో కలిసి పనిచేస్తున్న బిగ్ బీకి ప్రభాస్ తన ఇంటి విందు భోజనాన్ని రుచి చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా అమితాబ్ బచ్చన్ తెలిపారు. 'టీ4198-బాహుబలి ప్రభాస్. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్ మాత్రం జీర్ణించుకోలేను.' అని ట్వీట్ చేశారు అమితాబ్.
T 4198 - 'Bahubali' Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army ..
— Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022
the special cookies .. beyond scrumptious ..
And your compliments beyond digestible
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more