మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌గా మీసం మెలేస్తే ఎలా ఉంటుంది?.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ వస్తుంది.. రాయలసీమ పౌరుషం నేపథ్యంలో నటించిన ఇంద్ర సినిమాను సూపర్ హిట్ చేయడంలో ఆయన మీసం మెలేసిన సీన్ కూడా దోహదపడిందని అంటారు అభిమానులు. అదే నేచురల్ స్టార్ నాని మీసం మెలేస్తే.. శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్ చిత్రమే ఇందుకు నిదర్శనం అంటూరు ఫ్యాన్స్. అయితే మెగాస్టార్ చిరంజీవితో కలసి నేచురల్ స్టార్ నాని మీసం మెలేస్తే.. ఔనా.. నిజంగానే వీరిద్దరూ కలసి ఓ సినిమాలో నటించింది కూడా లేదు.. అలాంటిది ఇలాంటి సన్నివేశం నిజంగా జరిగిందా.? లేక ఇది ఫొటో మార్పింగా.? అన్న అనుమానాలు వ్యక్తం కావడం సహజం.
అయితే ఇది నిజంగానే జరిగింది. చిరంజీవితో కలసి నాని తీసుకున్న ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మెగాస్టార్‌తో కలిసి మీసం మెలితిప్పుతూ నేచురల్ స్టార్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరు తన కంటే వయసులో చిన్న యాక్టర్లతో ఎంత సరదాగా ఉంటారో.. వాళ్లు కలిసినప్పుడు వాళ్లతో ఎలా సందడి చేస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. నెరిసిన గడ్డంతో చిరు లుక్ కిరాక్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే నాని చిరంజీవిని కలవసం వెనుకు అసలు విషయం మరోటి ఉందని టాక్ వినిపిస్తోంది.
నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా రేపట్నించి నెట్ ఫ్లిక్స్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై ప్రదర్శించబడుతోంది. అయితే అదే సమయంలో డిస్ని-హాట్ స్టార్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ’అఖండ‘ కూడా ప్రదర్శించబడుతోది. దీంతో ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కానుండటంతో ఇప్పటివరకైతే బాలయ్య అఖండకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తమ చిత్రానికి కూడా అలాంటి క్రేజ్ తీసుకువచ్చే పనిలో భాగంగా నెట్ ఫ్లిక్స్ మెగాస్టార్ కు చిత్రాన్ని ప్రదర్శింపజేసింది. దీంతో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని చిరు అభినందించారు.
అంతేకాదు నానితో కలిసి దిగిన పిక్ ను ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో ఇద్దరూ మీసాలు మెలేస్తూ, చిరునవ్వులు చిందిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సెల్పీలో నాని ఎప్పటిలానే కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. క్రిస్మస్ సందర్భంగా 'శ్యామ్ సింగరాయ్' సినిమా విడుదలయింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో సినిమా విడుదలయినప్పటికీ... మంచి వసూళ్లను రాబట్టింది. దేవదాసి వ్యవస్థపై పోరాటం చేసే కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more