Ilayaraja's song going to outer space by rocket అంత‌రిక్షంలో సుస్వరాల మాంత్రికుడు సంగీతం

Isaigniani ilayaraja s song going to outer space by rocket

music director ilayaraja, Isaigniani Ilayaraja, ilayaraja songs, space, nasa, melodic songs, sattelite, world's smallest sattelite, Students, Tamil Nadu, Kollywood

Isaigniani Ilayaraja's songs have enthralled fans all over the world for the better part of half a century and those who are not mesmerized by his melodic songs can be easily counted. The amazing news has come that Raja's songs will be heard beyond the skies and into space soon.

అంత‌రిక్షంలో మారుమోగ‌నున్న సుస్వరాల మాంత్రికుడు ఇళ‌య‌రాజా సంగీతం

Posted: 01/20/2022 06:09 PM IST
Isaigniani ilayaraja s song going to outer space by rocket

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అంటే సంగీతప్రియులు చెవికోసుకుంటారు. ఆయన సమకూర్చిన సుస్వర బాణీలను వింటూ తన్మయత్వంతో మది తన స్థానాన్ని దాటి మరో ప్రపంచంలోకి అడుగుపెటుతుందని కూడా సంగీతాభిమానులు కితాబిస్తుంటారు. అయితే ప్రస్తుతం మాత్రం ఇళయరాజా సంగీతం అంతరిక్షంలోనూ మారుమోగనుంది. అదేంటి సంగీతాభిమానులు చలోక్తుల కోసం అలా అంటారు కానీ.. నిజంగానే అంతరిక్షంలో ఇళయరాజా సంగీతమేంటి అంటారా.? అవును ఇది నిజం. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థుల బృందం అత్యంత చిన్న శాటిలైట్‌ తయారు చేస్తోంది.

దీనిని భారతదేశ 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న నాసా సహకారంతో అంతరిక్షంలోకి పంపనున్నారు. అయితే మాత్రం ఇళయరాజా సంగీతమేంటి అంటారా.? ఆ వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల బృందం రూపోందించిన ఈ శాటిలైట్‌లో.. మనదేశం గొప్పతనాన్ని తెలియజేస్తూ గీత రచయిత స్వనంద్‌ కిర్కిరే రాసిన హిందీ పాటను వినిపించనున్నారు. కాగా ఈపాటకు ఇళయరాజా బాణీలు కట్టడానికి అంగీకరించడం, తమిళ వెర్షన్‌ను ఆలపించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అలా ఇళయరాజా సంగీతం ఆకాశ తరంగాలను మీటనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles