Actor Konchada Srinivas passes away due to heart illness గుండె సంబంధిత రుగ్మతతో సినీనటుడు శ్రీను మృతి

Tollywood actor konchada srinivas passes away due to heart illness

konchada srinivas, konchada srinivas dies, konchada srinivas passed away, konchada srinivas heart problem, konchada srinivas film shooting injury, konchada srinivas chest injury, sankranthi festvial, private hospital, Kasibugga, Srikakulam, Shankar Dada MBBS, Aadi, Prema Kavali, 10 TV serials, Andhra Pradesh, Tollywood, Crime

Tollywood actor Konchada Srinivas passed away due to illness at the age of 47. Srinivas passed away at a private hospital in Kasibugga in the Srikakulam district. According to his family members, the actor fell down on the sets of a film's shoot and got injured on the chest. After that, he had been diagnosed with a heart problem and was been sick.

గుండె సంబంధిత రుగ్మతతో సినీనటుడు శ్రీను మృతి

Posted: 01/20/2022 11:28 AM IST
Tollywood actor konchada srinivas passes away due to heart illness

తెలుగు సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్‌ (47) అనారోగ్యంతో మృతి చెందారు. తెలుగు సినీపరిశ్రమలో విలన్ క్యారెక్టర్ పాత్రలు వెస్తూ గుర్తింపును తెచ్చుకున్న ఆయన అకస్మిక మరణం చిత్రపరిశ్రమలో విషాధాన్ని నింపింది. శ్రీకాకుళం జల్లాలోని కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. సినిమా షూటింగ్ లో భాగంగా ప్రమాదవశాత్తు కిందపడిన ఆయనకు ఛాతిపై బలమైన గాయాలు అయ్యాయని, అయితే గాయాలకు చికిత్స నిమిత్తం చేసిన పరీక్షలలో ఆయనకు గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయని బయటపడిందిన తేలిసింది. దీంతో ఆయన చికిత్స పోందుతూ మరణించాడు. ఆయన మరణంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలలో విషాదఛాయలు అలుముకున్నాయి

ఈ క్రమంలో వచ్చిన సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో ప్రతీ ఏడు మాదిరిగా ఈ సారి కూడా ఆయన తన స్వగ్రామమైన కాశీబుగ్గకు వచ్చి తల్లిదండ్రులతో పాటు జరుపుకునేందుకు కుటుంబంతో పాటుగా వచ్చారు. అయితే సంక్రాంతి పర్వదినం కాగానే ఆయనకు గుండెలో నొప్పి రావడంతో అసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పోందుతూ క్రితం రోజు రాత్రి మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోగా, తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు అత్తా రిళ్లలో ఉన్నారు. శ్రీను మరణంతో జంట పట్టణాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్‌ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆది, శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles