తెలుగు చిత్రసీమ ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక తాజాగా వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు రూపోందుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ‘పుష్ప’ ది రైజ్ తొలిభాగం చిత్రం గతనెల 17న విడుదలైంది. ఈ చిత్రం బాక్సీఫిసు వద్ద రికార్డులను తిరగరాస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ హ్యాట్రిక్ చిత్రంగా రూపోందిన ఈ చిత్రం త్వరలోనే ఓటిటీలో ప్రసారం కానుంది. ఎవరూ ఊహించని విధంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా థియేటర్స్‌లో అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తున్న సమయంలోనే ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఓ వైపు హిందీలో రూపోందించిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో విడుదల అవుతున్న క్రమంలోనే ఇటు తెలుగు సహా దక్షిణాదిలోని నాలుగు బాషల్లో ఈ చిత్రం ఓటిటీలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని ఉన్నఫళ్లంగా తమ ఓటీటీలో ప్రదర్శించేందుకు అనుమతి పోందిన అమెజాన్ ప్రైం అందుకుగాను భారీ ఆఫర్ ను కూడా ప్రకటించిందని టాక్. దీంతో సినిమా విడుదలైన నాలుగు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో సందడి చేయనుంది.
పుష్ప సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్లో 60 కోట్ల మార్కు అందుకుంది. 75 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం 50 రోజుల గ్యాప్ ఉంటుంది. అయితే సినిమాను అమ్మేటప్పుడు నిర్మాతలు చేసుకునే ఒప్పందాన్ని బట్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మూడు నుంచి నాలుగు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాయి. ఇప్పుడు పుష్ప సినిమాకు కూడా అలాగే నాలుగు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 7న సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రకటించింది. హిందీ మినహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more