Sree Vishnus Arjuna Phalguna locked release date శ్రీవిష్ణు నటించిన అర్జున ఫాల్గుణ రిలీజ్ డే్ట్ లాక్.!

Sree vishnu and amritha aiyer arjuna phalguna release date out

Arjuna Phalguna, Arjuna Phalguna release date, Sree Vishnu, Amritha Aiyer, Teja Marni, Priyadarshan Balasubramanian, Niranjan Reddy, Anvesh Reddy, Matinee Entertainment, Tollywood, movies, Entertainment

Sree Vishnu and Teja Marni are currently working for an upcoming comedy caper titled Arjuna Phalguna. Today the makers of Arjuna Phalguna announced the release date of the film. According to the latest report, Arjuna Phalguna is getting ready for release in theaters on 31st December.

శ్రీవిష్ణు నటించిన అర్జున ఫాల్గుణ రిలీజ్ డే్ట్ లాక్.!

Posted: 12/16/2021 06:56 PM IST
Sree vishnu and amritha aiyer arjuna phalguna release date out

యంగ్ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలను ఎంచుకుని వాటిలోని పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తూ.. తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. శ్రీవిష్ణు ఉన్నాడంటే ఆ చిత్రంలో మినిమమ్ గ్యారంటీ చిత్రమనే ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతోనే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'రాజ రాజ చోర' హిట్ టాక్ ను సంపాదించుకుంది. శ్రీవిష్ణు కామెడీ కూడా బాగా చేస్తాడనే మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'అర్జున ఫల్గుణ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా తేజ మార్ని పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది. నరేశ్ .. సుబ్బరాజు .. శివాజీ రాజా .. జబర్దస్థ్ మహేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ప్రియదర్శన్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles