Sanchari Song From Radhe Shyam Is Out ఫీల్ గుడ్ సాంగ్ ‘సంచారి’తో అలరిస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్

Radhe shyam s sanchari has prabhas exploring europe for love

radhe shyam, radhe shyam new song, radhe shyam movie, prabhas, prabhas new song, prabhas, sanchari, radhe shyam, sanchari song, sanchari music video, prabhas radhe shyam, radhe shyam release date, prabhas new movie, pooja hegde new, pooja hegde new songs, pooja hegde videos, pooja hegde new movie, pooja hegde dance, pooja hegde latest movie, prabhas latest, Bollywood, movies, Entertainment

The video Radhe Shyam’s Sanchari, starring Prabhas, was unveiled by its makers on Thursday. Justin Prabhakaran has composed the music for the song and it also got released in Tamil, Malayalam, Kannada with the titles – Raegaigal, Swapnadoorame, and Sanchari.

ఫీల్ గుడ్ సాంగ్ ‘సంచారి’తో అలరిస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్

Posted: 12/16/2021 05:52 PM IST
Radhe shyam s sanchari has prabhas exploring europe for love

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్.. తన అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేసి.. వారికి ముందుగానే క్రిస్ట్ మస్ కానుకను అందించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ సాగుతున్నాయి. ఇటీవ‌ల ‘ఆషికీ ఆగ‌యా..’ అంటూ సాగే హిందీ సాంగ్ ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇది ప్ర‌భాస్ ఫ్యాన్స్‌నే కాదు.. సినీ అభిమానులను కూడా అల‌రించింది. ఇక తాజాగా ఈ రోజు మూడవ పాట సంచారి చిత్రబృందం విడుదల చేసింది.  

ఈ పాట‌లో రెబల్ స్టార్ ప్రభాస్ స్టయిలిష్ లుక్ లో అదిరిపోయాడు. పాట మొత్తాన్ని విదేశాల్లోనే చిత్రీకరించారు. ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. 1950ల నాటి ప్రేమ కథాంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాలోని 'ఈ రాతలే', 'నగుమోము తారలే' అనే రెండు పాటలను సినిమా యూనిట్ విడుదల చేసింది. 'సంచారి' పాటను మీరు కూడా వీక్షించండి. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేష‌న్స్‌, టి సిరీస్ సంస్థ‌ల‌పై మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ సినిమాను డైరెక్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles