Samantha item song goes viral online నెట్ జనలకు విపరీతంగా నచ్చిన సమంత ఐటెం సాంగ్..!

Samantha s first ever item song from allu arjun s pushpa goes viral online

Samantha, Oo Antava..Oo Oo Antava, Pushpa, Allu Arjun, Rashmika mandana, sukumar, DSP, Indravathi Chauhan, Samantha news, Samantha English film, Samantha updates, Samantha movies, Samantha upcoming movies, Samantha breaking news, Samantha breaking updates, Samantha lineup of films, Samantha upcoming projects, Tollywood, Movies, Entertainment

Samantha is one of the most sought-after heroines in the Indian film industry. The south queens first ever glamour song in Allu Arjun and Rashmika Mandanna starrer 'Pushpa - The Rise' directed by Sukumar is going viral online. The lyric video of the item number 'Oo Solriya Oo Oo Solriya' rocked with 45 Million views and 1.6million likes.

నెట్ జనలకు విపరీతంగా నచ్చిన సమంత ఐటెం సాంగ్..!

Posted: 12/15/2021 08:46 PM IST
Samantha s first ever item song from allu arjun s pushpa goes viral online

హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలపై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేసేస్తూ జోరు చూపిస్తోంది. వివాహ బంధం నుంచి వైదొలిగిన కొన్నాళ్లకే మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్న సామ్.. అటు బాలీవుడ్ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలపై సినిమాలతో జోష్ లో వున్న సామ్.. మొట్టమొదటి సారిగా చేసిన ఐటం సాంగ్‌ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ అనగానే నెట్టిజనులు ఫిదా అవుతున్నారు.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘పుష్ప’ తొలిభాగం ది రైజ్ లో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' స్పెషల్‌ సాంగ్ లో అలరించింది. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగిన ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో గత శుక్రవారం ఈ నెల 10న సాయంత్రం చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో లంగా జాకెట్‌లో కనిపించిన సమంత తన అందచందాలను ఆరబోస్తూ మరోసారి కుర్రకారును మత్తెక్కించింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్లో ఒక్క‌సారి కూడా స్పెషల్‌ సాంగ్స్ చేయ‌ని సామ్‌ మొద‌టిసారిగా బ‌న్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

ఈ పాటను రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలుపుకుని 45 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి. 1.6 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. థియేటర్స్ లో ఈ సాంగ్ మరింత సందడి చేయడం ఖాయమని అంటున్నారు. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన‌ ఈ పాట కోసం స‌మంత‌ ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప సినిమాకు స‌మంత‌, ఈ స్పెష‌ల్ సాంగ్ మ‌రింత స్పెష‌ల్‌ అట్రాక్షన్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles