HC suspends cinema tickets 'price' restriction GO టాలీవుడ్ చిత్రాల ధరలపై ప్రభుత్వ జీవో రద్దు చేసిన హైకోర్టు

Ap high court suspends go 35 over the reduction of movie ticket prices

Andhra Pradesh High Court, Movie ticket prices, Theater owners, Minister Perni Nani, YS Jagan Mohan Reddy, AP State government, Amaravati, Amaravati news, Amaravati latest news, Andhra Pradesh, Andhra Pradesh news, Film Industry, Good news, Andhra Pradesh, government, akhanda, Balakrishna, Tollywood, House, Cinema, Pawan Kalyan, AP High Court, Andhra Pradesh, AP movie ticket price, AP movie ticket price issue, AP movie ticket rates, AP movie ticket news, AP movie ticket issue, movie ticket prices in AP

The Andhra Pradesh High Court has suspended GO issued by the government over the reduction of the movie ticket prices in the state. Theater owners' lawyers have argued that the government does not have the power to reduce movie ticket prices.

టాలీవుడ్ చిత్రాల ధరలపై ప్రభుత్వ జీవో రద్దు చేసిన హైకోర్టు

Posted: 12/14/2021 09:47 PM IST
Ap high court suspends go 35 over the reduction of movie ticket prices

తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట కలిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సరికొత్త జీవో నెంబరు 35ను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు రద్దు చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటీషనర్లకు వెసలుబాటు కల్పించింది. సినిమా రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.

ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలను వినిపించారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని వారు కోర్టుకు తెలిపారు. టికెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును పిటిషనర్లకు కల్పించింది.

జీవో విషయంలో పునరాలోచించాలని సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు. అయితే తమకు ఏ సినిమా అయినా ఒకటేనని, పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు భారీగా పెంచేస్తున్నారని, దాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం టికెట్‌ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలు వేదికలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్‌ యజమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles