Skylab Release teaser is entertaining, engaging ఆసక్తి పెంచుతున్న సత్యదేవ్ ‘స్కైలాబ్’ టీజర్

Skylab release teaser is entertaining engaging

Skylab, Skylab Release Teaser, Nithya Menen, Satyadev, Rahul Ramakrishna, Vishvak Khanderao, Prithvi, Tollywood, Movies, Entertainment

The makers of Skylab have released its release teaser. The 48-second-teaser, which is quirky like the earlier things associated with the project, raises well the expectations on the movie. It shows interesting glimpses from the movie and features the lead characters too who get the shock as well as opportunity of their lives when it was announced that Skylab, a space laboratory, is going to fall on earth. What happens next forms the crux.

ఆసక్తి పెంచుతున్న సత్యదేవ్ ‘స్కైలాబ్’ టీజర్

Posted: 12/01/2021 09:24 PM IST
Skylab release teaser is entertaining engaging

యంగ్ హీరో సత్యదేవ్ - నిత్యామీనన్ జంటగా 'స్కైలాబ్' సినిమా రూపొందింది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, పృథ్వీ పిన్నమరాజు నిర్మించాడు. నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. చాలా కాలం క్రితం స్కైలాబ్ పడుతుందనీ..  ఎవరూ బ్రతకరనే ప్రచారం గ్రామాల్లో బలంగా జరిగింది. దాంతో ఎవరికి ఇష్టమైనవి వారు చేసుకుని తిన్నారు.

ఏ క్షణంలో ఎక్కడ స్కైలాబ్ పడుతుందోనని ఆకాశం వైపు చూస్తూ భయంతో బ్రతికారు. ఆ సంఘటననే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. టీవీలకు .. మొబైల్  ఫోన్లకు  దూరంగా గడిచిన ఆ కాలానికి సంబంధించిన వాతావరణాన్ని బాగానే ప్రతిబింబించారు. సినిమాలో కావలసినంత కామెడీ ఉంటుందనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. తులసి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన  పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles