Allu Arjun starrer `Pushpa` trailer out ‘పుష్ఫ’ నుంచి వచ్చేసిన తొలిభాగం ట్రైలర్

Pushpa trailer allu arjun s high voltage mass feast

Pushpa, Allu Arjun, Rashmika Mandana, sukumar, Mythri movie makers, Devi Sri Prasad, Pushpa, Allu Arjun, Sukumar, Mythri Movie Makers, Pushpa news, Fahadh Faasil Pushpa, Rashmika Mandanna Pushpa, Dhanunjay Pushpa, Rao Ramesh Pushpa, Suneel Pushpa, Anasuya Bharadwaj Pushpa, Ajay Ghosh, Pushpa movie latest, Pushpa Allu Arjun, Pushpa Raj, Rashmika Mandanna, Fahadh Faasil, Tollywood, movies, Entertainment

The much awaited theatrical trailer of Pushpa: The Rise is out now and it Allu Arjun and Sukumar’s Mass feast all the way through. The trailer starts off with a voice over regarding red sandalwood smuggling in Seshachalam forests backdrop. Allu Arjun’s makeover, his dialect, and the presentation are elite. He nails the Chittoor dialect. “Pushpa ante flower anukunnara… FIREE,” dialogue stands out.

అంచనాలను అమాంతం పెంచుతున్న అల్లు అర్జున్ ‘పుష్ఫ’ ట్రైలర్..

Posted: 12/06/2021 09:42 PM IST
Pushpa trailer allu arjun s high voltage mass feast

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' చిత్రం ఈ నెల విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపోందుతోంది. తొలి భాగం ఈ నెల 17న విడుదల కానుండగా, రెండో భాగం మాత్రం షూటింగ్ కొనసాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఊపేస్తున్నాయి.

‘‘వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. పులిని తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా అకలి.. దాక్కో దాక్కో మేక.. పులోచ్చి కోరుకుద్ది పీక..’’ అన్న పాటతో పాటు ‘‘నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే.. నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే.. కనిపించని దేవుడినే కన్నార్పక చూస్తావే.. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే.. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే..  చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయేనే.. ’’ అన్న పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చుతున్నాయి. ఇక తాజాగా సామి సామి అనే మూడవ సింగిల్ ను విడుదల చేసింది చిత్రబృందం.

‘‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నా సామి.. నిన్ను సామి సామి అంటుంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి.. నా సామి.. నీ వెనకే వెనకే అడుగేస్తుంటే.. వెంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి.. నీ పక్క పక్కనా కూసుంటుంటే పరమేశ్వరుడి దక్కినట్టుగుందిరా సామి..’ అంటూ సాగే ఈ మూడో పాట శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక నాలుగో సింగ్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగిన సాంగ్ కూడా ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. ఇక త్వరలో తొలి భాగం విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ముందస్తుగానే ప్రకటించినట్లు ట్రైలర్ ను విడుదల చేసింది.

అయితే అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా ట్రైలర్ విడుదలైంది. బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ట్రైలర్ రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేశారు. అయినా అభిమానులకు మాత్రం ఎప్పుడెప్పుడు ట్రైలర్ విడుదల అవుతుందా అంటూ వేచిచూసిన నేపథ్యంలో రాత్రి విడుదలైనా దానిని వీక్షించారు. దీంతో లక్షల వ్యూస్ తో అలరిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదలైన ఈ ట్రైలర్ కి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

"భూమిపై పెరిగే బంగారం... పేరు ఎర్రచందనం" అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ నటించే యాక్షన్ సీక్వెన్స్ లు, హీరోయిన్ రష్మిక మందన్నతో రొమాన్స్, చిత్తూరు యాస అన్నీ కలగలిపి 'పుష్ప' ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ట్రైలర్ లో అల్లు అర్జున్, పహాద్ ఫస్సిల్ మధ్య పోటాపోటీగా యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. ఇక ఇందులో అనసూయ భరత్వాజ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులు కూడా కీలక పాత్రలను పోషించారు. మరెందుకు ఆలస్యం మీరు ట్రైలర్ ను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles