RRR: Ram Charan, Jr NTR's dance number has mass appeal పంబరేపుతున్న ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ మాస్ సాంగ్.!

Rrr song naatu naatu ram charan jr ntr raise a storm in ss rajamouli film

RRR, Jr NTR, Ram Charan, Naatu naatu song, rrr mass song, RRR naatu naatu song, Alluri sitaramaraju, ss rajamouli, rrr video, rrr release date, rrr Jan 7 2022, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Ajay devgn, Alia Bhatt, MM keeravani, Tollywood, Entertainment, movies

RRR teasers and glimpses have kept fans excited about the SS Rajamouli film till now. But the makers are ready to amp up the anticipation with the film’s new song, which they have tagged as the “mass anthem.” Titled Naatu Naatu in Telugu, the new song features Jr NTR and Ram Charan. Naatu Naatu offer double the fun as the two actors perform together on screen and create an insane energy, which makes you want to dance too.

పంబరేపుతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ మాస్ సాంగ్.!

Posted: 11/10/2021 07:44 PM IST
Rrr song naatu naatu ram charan jr ntr raise a storm in ss rajamouli film

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం నుంచి ఇక ఇప్పుడు వరుస పెట్టి అప్ డేట్ లు అందుతున్నాయి. ఈ అప్ డేట్ లను కూడా తన సినిమా ప్రమోషన్స్ కు దర్శకధీరుడు వినియోగించుకుంటారు. అంతేకాదు అదే సమయంలో తన చిత్రాలపై ఇప్పటికే ఉన్న అంచానాలను మరింత పెంచుకునేందుకు కూడా వీటిని వినియోగించుకుంటారు. ఇటీవల విడుదల చేసిన పస్ట్ గ్లింప్స్ వీడయోకు ధీటుగా తాజాగా మరో వీడియోను వదిలారు చిత్రబృందం.

ఇద్దరు హీరోలు అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు మెగా అభిమానులు మంచి మాస్ సాంగ్ విని ఎన్నాళ్లయ్యిందో. కానీ ఆ లోటును మేం కలసి భర్తీ చేస్తామని అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇటు తారక్ లు మంచి ఊపుమీద చిందులేసిన పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటి వరకు చిత్రంలోని కీలక పాత్రల ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం.. అటు చరణ్, ఇటు తారక్ లను కూడా విడివిడిగానే చూపింది. కానీ తొలిసారిగా ఇద్దరు హీరోల అభిమానుల కడుపు నింపేలా..ఊరమాస్ సాంగ్ ను ఇద్దరు హీరోలతో కలసి విడుదల చేశారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు.

తెలుగు చలన చిత్రసీమకు చెందిన ఇద్దరూ గ్రేట్ డాన్సర్స్ కలిసి స్క్రీన్ మీద స్టెప్పులు వేస్తుంటే అభిమానులకు సంక్రాంతి డబుల్ ధమాకాను అందించడం గ్యారంటీ అంటున్నారు సినీవిశ్లేషకులు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో వస్తున్న ఈ సాంగ్ లో చరణ్, తారక్ డాన్సులకు సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవడం ఖాయం. ముఖ్యంగా ఇప్పుడు విడుదలైన లిరికల్ సాంగ్ లో రెండు స్టెప్పులు అభిమానుల కోసం చూపించాడు రాజమౌళి. అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఈ పాట రేంజ్ మారిపోయింది. అది చూసిన తర్వాత సినిమాలో సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో క్లారిటీ వచ్చేసింది. కీరవాణి అందించిన మాస్ ట్యూన్ కూడా పంబరేపేలావుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles