Ram Charan lends his voice for Varun Tej ‘Ghani’ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ‘గని’ టీజర్.!

Varun tej s ghani teaser sets screens on fire

Ghani, Varun Tej, Saiee Manjrekar, Ghani teaser, Ram Charan voiceover, Sunil Shetty, Upendra, Naresh, Ghani Teaser, Introducing the World of Ghani, Naveen Chandra, Nadiya, Satya, Srinivas Reddy, Ghani Glimpse, Ghani Trailer, Ghani songs, Ghani Anthem, world of ghani, ghani world, Kiran Korrapati, Thaman, Tollywood, Movies, Entertainment

Makers of Varun Tej-starrer Ghani have released the movie's teaser which is racy from the word go. The teaser gives an adrenaline rush to the audience and sets the expectations on the film on a new high, thanks to Varun Tej's looks and the team's efforts.

విజేతగా నిలిచేది ఒక్కడే.. అది నువ్వే ఎందుకు.? గని టీజర్..

Posted: 11/15/2021 08:24 PM IST
Varun tej s ghani teaser sets screens on fire

టాలీవుడ్ మోగా ప్రిన్స్ హీరో వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమా కోసం త‌న మేకోవ‌ర్‌ను పూర్తి మార్చేశాడు వ‌రుణ్ తేజ్‌. త‌న ఫాలోవ‌ర్ల‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు వ‌రుణ్ తేజ్‌. గ‌ని టీజ‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రాంచ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైంది గ‌ని టీజ‌ర్. వ‌రుణ్ తేజ్ బాడీ బిల్డింగ్‌, ఇంటెన్స్ లుక్‌, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో స్ట‌న్నింగ్ అవ‌తార్‌లో క‌నిపిస్తున్నాడు.

బాలీవుడ్ భామ, ద‌బాంగ్ 3 ఫేం స‌యీ మంజ్రేక‌ర్ వ‌రుణ్ తేజ్‌కు జోడీగా న‌టిస్తోంది. త‌న మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే థ‌మ‌న్ అదిరిపోయే బీజీఎంతో అద‌ర‌గొట్టేశాడు. సునీల్ శెట్టి, ఉపేంద్ర‌, న‌రేశ్ ల పాత్ర‌లు సినిమాకే హైలెట్‌గా నిలిచేలా క‌నిపిస్తున్నాయి. ప్ర‌తీ ఒక్క‌డి క‌థ‌లో క‌ష్టాలుంటాయి.. క‌న్నీళ్లుంటాయి.. కోరిక‌లుంటాయి..కోపాలుంటాయి..ప్ర‌తీ ఒక్క‌రికీ చాంపియ‌న్ అయిపోవాల‌న్న ఆశ‌యం ఉంటుంది..కానీ విజేత‌గా నిలిచేది ఒక్క‌డే. ఆ ఒక్కడివి నీవే ఎందుకు.? అంటూ హీరో పాత్రను ప్రశ్నించే విధంగా.. పాత్రను ఎలివేట్ చేసే తరహాలో రాంచ‌ర‌ణ్ చెప్పే సంభాష‌ణ‌ల‌తో సాగే టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles