court rejects Kangana Ranaut plea in defamation case కంగన రనౌత్ కు కోర్టులో చుక్కెదురు.. పిటీషన్ కొట్టివేత

Big setback for kangana ranaut court rejects transfer of defamation case

Kangana Ranaut, transfer of defamation case, Javed Akhtar, Sushant Singh Rajput, defamation case, Addl Chief Metropolitan Magistrate, Mumbai court, Entertainment News, Movies News, Bollywood News, tollywood, Moives, Entertainment

A Mumbai court recently rejected actress Kangana Ranaut’s plea seeking transfer of lyricist Javed Akhtar's complaint to a different court. While denying the transfer of case, the Additional Chief Metropolitan Magistrate said, 'It is a settled position of law that the proceeding cannot be transferred from one court to another on mere apprehension.'

కంగన రనౌత్ కు కోర్టులో చుక్కెదురు.. పిటీషన్ కొట్టివేత

Posted: 10/23/2021 04:23 PM IST
Big setback for kangana ranaut court rejects transfer of defamation case

బాలీవుడ్ యువనటడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ను ఇప్పటికీ చుట్టుముట్టిన వివాదాలు మరింతగా అమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కంగన రౌత్ తనపై చేసిన వ్యాఖ్యలపై పాటల రచయిత జావెద్ అఖ్తర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ముంబై అంధేరిలోని అడిషనల్ మెట్రోపాటిలన్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసును ఆయన నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని అమె పేర్కోంది.

ఈ మేరకు తనపై వేసిన పరువు నష్టం దావా కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ అమె అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కంగన పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సదరు కోర్టు కంగన పిటిషన్ ను తోసిపుచ్చింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగానే విచారణ జరుపుతున్నారని కోర్టు తెలిపింది. కంగనకు వ్యతిరేకంగా పక్షపాతాన్ని ప్రదర్శించలేదని చెప్పింది. చట్టబద్ధంగా వెళ్లడం కంగనకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు కాదని తెలిపింది. కేవలం అనుమానం కారణంగా కేసులో ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles