తమిళ నటుడు సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే నిజ జీవిత వృత్తాంతంతో తెరకెక్కిన చిత్రంలో తనదైన సహజ నటనతో అలరించిన సూర్య.. తాజాగా జై భీమ్ చిత్రంతో పేదవాడి పూరిగుడిసెలపైకి గతలో జరిగిన అన్యాయాలు, అరచకాలు, పెత్తెందారి వ్యవస్థను తూర్పారబడుతు.. పేదలకు న్యాయంచేసే ఓ న్యాయవాదిగా పోరాటం చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం.
తప్పుడు కేసులో ఇరికించిన గిరిజనులవైపు పోరాడే పాత్రలో సూర్య లాయర్‌గా నటించాడు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించారు. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా, ఇందులోని సన్నివేశాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం’ అన్న నినాదాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అమాయక గిరిజనుల కోసం పోరాడుతున్న లాయర్‌గా సూర్య అదరగొట్టాడు.
‘జై భీమ్’ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు.అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం సూర్య వరుసగా నాలుగు సినిమాలను నిర్మించి ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో ఇదొక సినిమా. త.సె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’లో ఇతర ప్రధాన పాత్రలను రజీషా విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ పోషించారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more