పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపోందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేశారు. దీంతో ఈ చిత్రం నుంచి తాజా సమాచారం ఎప్పుడెప్పుడు అందుతుందా అంటూ వేయి కళ్లతో వేచిచూసిన ప్రభాస్ అభిమానుల కన్నుల పండువగా చిత్రబృందం రాధేశ్యామ్ నుంచి టీజర్ ను వదిలింది. ఫ్యాన్స్ అంచనాలను మించిన రేంజ్ లో టీజర్ ఉంచి.
టీజర్ ప్రారంభంతోనే ప్రభాస్ వాయిస్ వినబడుతోంది. ‘‘నువ్ ఎవరో నాకు తెలుసు.. కానీ ఏది చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు అది చెప్పను.. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నేను చెప్పను.. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. నాకు అన్నీ తెలుసు.. కానీ నేను ఏదీ చెప్పను. ఎందుకంటే అది మీ ఊహలకు కూడా అందదు.. నా పేరు విక్రమ్ ఆదిత్య.. నేను దేవుడిని కాదు. అలా అని నేను మీలో ఒకడిని కూడా కాదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.
ఈ డైలాగ్స్ అని వెలువడుతున్న సమయంలో గులాబి పువ్వు పడిపోతున్నట్లు.. ప్రేమతో రాసిన అక్షరాలు వాటి చుట్టూ హృదయ ఆకారం గీసి ఉండటం.. హస్తంలో వున్న సాముద్రికాలు.. చూపుతూనే మరోవైపు ప్రభాస్ పడుకుని, నడుస్తూ వెళ్లే షాట్స్ కట్ చేశారు. ప్రభాస్ స్టైలిష్ లుక్స్‌కి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్గా నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more