Brahmanandam's 'Panchatantram' Teaser Launch ఆకట్టుకుంటోన్న బ్రహ్మానందం ‘పంచతంత్రం’ టీజర్

Panchathantram teaser brahmanandam turns story teller

Panchathantram Teaser, Brahmanandam, Swathi Reddy, Samuthirakhani, Rahul Vijay, Shivathmika Rajashekar, Naresh Agastya, Divya Drishti, Harsha Pulipaka, Prashanth R Vihari, Akhilesh Vardhan, Srujan Yarabolu, Tollywood, movies, Entertainment

Touted to be an anthology dealing with five different stories, the teaser of 'Panchatantram' was unveiled. Actor Satya Dev lent his voice for the teaser. He introduces the characters and the world of Panchathantram to us. It is good to see actors like Brahmanandam and Swathi Reddy back on the screen after a long time. Both of them played pivotal roles in it.

ఆకట్టుకుంటోన్న బ్రహ్మానందం ‘పంచతంత్రం’ టీజర్

Posted: 10/13/2021 05:03 PM IST
Panchathantram teaser brahmanandam turns story teller

హీరోయిన్ స్వాతి అలియాస్ కలర్స్ స్వాతి.. మా టీవిలో యాంకర్ గా చక్కని గుర్తింపును తెచ్చుకున్న తరువాత అదే క్రేజ్ తో తెరంగ్రేటం కూడా చేసింది. ఈ అమ్మ‌డు ఓ బుల్లితెర షోతో పాపులారిటీని అందిపుచ్చుకోగా ఆ త‌ర్వాత మెల్ల‌గా సినిమా ఆఫ‌ర్స్ అందుకుంది. 2005లో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన డేంజర్ మూవీలో కీలక రోల్ చేసింది.  ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించక పోయినప్పటికీ స్వాతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆత రువాత విక్టరీ వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది.

ఆ తరువాత నేరుగా కోలీవుడ్ నుంచి హీరోయిన్ గా చిత్రం రావడంతో అక్కడ తెరంగ్రేటం చేసింది. తమిళ్ మూవీ సుబ్రమణ్యపురంలో లీడ్ హీరోయిన్ అవకాశం దక్కించుకున్న స్వాతి, హీరోయిన్ గా హిట్ కొట్టింది. అదే జోష్ లో ఇటు తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. సౌత్ లో తెలుగు, తమిళ, మలయాళ బాషలలో 20కి పైగా చిత్రాలు చేశారు స్వాతి. 2018లో మలయాళ కుర్రాడు వికాస్ వసును పెళ్లి చేసుకున్న స్వాతి.. ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ పంచ‌తంత్రం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

తాజాగా పంచతంత్రం నుండి టీజర్ విడుదల అయింది. అయితే ఈ టీజర్ ఎంతో ఆసక్తిగా ఉంది. కథల గురించి చెప్తూ ఉన్నటువంటి ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ సత్యదేవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మీక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య దృష్టి, వికాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మ్యాజికల్ డ్రామా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేలా క‌నిపిస్తుంది. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్. విహారి అందిస్తున్నారు. మీరు టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles