ఎదుటివారి వ్యక్తిత్వం.. వ్యవహారశైలి, శుభ్రం, పనులు చేయడం పట్లు వారి అంకితభావం.. ఆడటంలో వారు వ్యవహరించే తీరు.. నలుగురిలో వారు మాట్లాడే తీరు.. వారిని నిందించే క్రమంలో వారు చెప్పే కారణాలు ఎలా వుంటాయన్నది తెలుసుకోవడం అందరికీ ఇష్టమే. కొందరు ఇలాంటి పదిమందిలో ఒకర్ని ఎంచుకుని ఒకరు అచ్చంగా తనలాగే వున్నారని పోల్చుకుంటుండగా, మరికొందరు మాత్రం పదిమందిలో ఎవరు తప్పుచేస్తే వారిని తప్పుబడుతుంటారు. ఇక తనకు నచ్చినవారికి మద్దతు పలుకుతుంటారు.
ఇదే ఇతివృత్తంతో వచ్చిన బిగ్ బాస్ షో అందుకనే సూపర్ హిట్ అవుతోంది. బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 5 జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తి చేసుకోగా, షో రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. అయితే అక్టోబర్ 3వ తేదీన నవరాత్రి ఉత్సవాలు పేరుతో బిగ్‌బాస్ స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు పలువురు గెస్ట్‌లని ఆహ్వానించింది బిగ్ బాస్ యాజమాన్యం.
స్సెషల్ ఎపిసోడ్‌లో వినోదం పంచేందుకు హైపర్ ఆది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నటులు అఖిల్, పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్, నాట్యం నటి వచ్చి తమ పర్ఫామెన్స్‌తో అలరించారు. అయితే ఆది పోలీసు ఆఫీసర్‌గా వచ్చి బిగ్‌బాస్ హౌజ్‌మెట్స్‌పై ఇన్వెస్టిగేషన్ చేశాను అంటూ గుక్క తిప్పుకోనివ్వకుండా మాట్లాడాడు. ఉన్నంత సేపు ఫుల్‌గా వినోదం పంచాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఆ మాత్రం ఇవ్వడంలోతప్పులేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more