Naga babu Resigns From MAA Membership ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Maa elections 2021 mega brother nagababu resigns from maa membership

Nagababu, Chiranjeevi, Megastar support, Prakash raj, maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, jayasudha, sudigali sudheer, srikanth, prakash raj news, tollywood, movies, entertainment

After the announcement of Manchu Vishnu as New MAA (Movie Artists Association) MegaBrother, Producer and actor Nagababu Resigns to MAA Membership. Naga Babu took to his Twitter and shared a post, “Movie Artists Association- MAA is filled with narrow mindedness and regional feelings. I don’t want to continue within this association and I am submitting my resignation to my primary membership from the MAA association.”

MAA Elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Posted: 10/11/2021 12:24 PM IST
Maa elections 2021 mega brother nagababu resigns from maa membership

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలలో ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ కు మద్దత్తునిస్తున్న సినీన‌టుడు, మెగాబ్రదర్ నాగ‌బాబు తన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మా అసోసియేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఫ్యానల్ కు తొలి నుంచి ఆయన మద్దుతునిస్తున్నారు. కాగా, ఆయన మా ఎన్నికలలో తన ప్రత్యర్థి మంచు విష్ణు ప్యానెల్ గెలుపోందడాని ప్రకటన వెలువడిని కొన్ని గంటల వ్యవధిలోనే మెగాబ్రదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  

మా ఎన్నికలలో మంచువిష్ణ ప్యానెల్ విజయం సాధించడం హీరో శ్రీకాంత్, ఎనమిది మంది కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపోందారు. మా అధ్యక్షులుగా మంచు విష్ణు, కార్యనిర్వహక ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ గెలుపొందారు. ఇక ఎగ్జిక్యూటివ్ మెంబరల్లోనూ 10 మంది మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన వారు.. ఎనమిది మంది మాత్రమే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారు గెలుపొందారు. దీంతో తాను మద్దతునిచ్చిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఓటమి నేపథ్యంలో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన రాజీనామా విషయాన్ని దృవీకరిస్తూ.. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు అంటూ నాగబాబు పోస్టు పెట్టారు. తన రాజీనామా ను మా అసోసియేషన్ కి 48 గంటల్లో తన స్టాఫ్ ద్వారా పంపుతాను అని తెలిపారు. ఇది ఎంతో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా పూర్తి చిత్తశుద్ది తో తీసుకున్న నిర్ణయం అని అన్నారు. నాగబాబు తీసుకున్న నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles