MAA Elections 2021: Manchu Vishnu Is The New President ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

Maa elections 2021 manchu vishnu is the new president wins by 107 votes

MAA Elections, MAA Elections 2021, MAA Elections winners, MAA Elections 2021 winners, MAA Elections news, MAA Elections updates, MAA Elections breaking news, MAA Elections new updates, Manchu Vishnu MAA Elections, Manchu Vishnu MAA Elections panel, Manchu Vishnu MAA Elections announcement, Manchu Vishnu MAA Elections latest, Manchu Vishnu MAA Elections latest updates, Tollywood, Movies, Entertainment

The prestigious MAA Elections for the year 2021 voting concluded yesterday and the results were also declared after the counting that took place since 4 p.m. Manchu Vishnu won on Prakash Raj by 107 votes. There was a tough fight between both of them during the initial rounds but Vishnu had clear majority as the counting concluded. A record number of 605 votes are polled out of the 883 votes in the elections.

‘మా’ ఎన్నికలు 2021: నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

Posted: 10/11/2021 11:22 AM IST
Maa elections 2021 manchu vishnu is the new president wins by 107 votes

తెలుగు సినీ పరిశ్రమకు చెందని మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ నూతనాధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ఎన్నడూ లేని విధంగా మొత్తం 883 మంది మా సభ్యులకు గాను ఈ సారి అత్యధిక పోలింగ్ నమోదైంది. అందుకు ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు ప్యానల్ మధ్య జరిగిన పోటీయే కేంద్రబిందువుగా ఎన్నికలలో మా సభ్యులు ఓటింగ్ కు పాల్గోన్నారు. విజయం అద్యంతం దోబూచులాట మధ్య సాగినా.. చివరికి మోహన బాబు కుటుంబం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. ఈ క్రమంలో ఏకంగా 60 పోస్టల్ ఓట్లను కూడా వారు సమకూర్చుకోవడంతో విజయం వారి వశమైంది. ఈ ఎన్నికలలో 605 ఓట్లు పోలయ్యాయి.

ఇక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో అభ్యర్థులిద్దరి మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ సాగినా.. చివరి ఘట్టానికి వచ్చేసరికి మంచువిష్ణు అధిక్యంలో కొనసాగారు. దీంతో ప్రకాశ్ రాజ్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మంచువిష్ణు ప్రకాశ్ రాజ్ పై 107 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి హీరో శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ తదితరులు గెలుపోందారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడిన జీవిత రాజశేఖర్ కేవలం 7 ఓట్ల తేడాతో రఘుబాబు చేతిలో పరాజయం పాలైయ్యారు. కోశాధికారిగా శివబాలాజీ గెలుపోందారు.

‘మా’ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం:

అధ్యక్షుడు: మంచు విష్ణు
ఉపాధ్యక్షుడు: మాదాల రవి, బెనర్జీ
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
కోశాధికారి: శివ బాలాజీ
ప్రధాన కార్యదర్శి: రఘు బాబు
జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్, గౌతం రాజు

కార్యనిర్వాహక కమిటీ సభ్యులు:
అనసూయ భరద్వాజ్
బ్రహ్మజీ
ఖయ్యూమ్
కౌశిక్
శివ రెడ్డి
సంపూర్ణేష్ బాబు
సురేష్ కొండేటి
మాణిక్‌
హరినాథ్‌
బొప్పన
శివ
జయవాణి
శశాంక్‌
పూజిత
పసునూరి
శ్రీనివాస్‌
శ్రీలక్ష్మీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles