Ravi Teja in talks for Megastar's Next? మళ్లీ మెగాస్టార్ తో నటించనున్న ఆ స్టార్ హీరో.?

Ravi teja in talks for megastar s next chiranjeevi news

Chiranjeevi, Ravi Teja, KS Ravindra, Bobby, Mythri Movie Makers, Chiranjeevi Ravi Teja, Chiranjeevi Ravi Teja news, Chiranjeevi Ravi Teja updates, Chiranjeevi Ravi Teja latest, Chiranjeevi Ravi Teja movie updates, Chiranjeevi Ravi Teja breaking news, Chiranjeevi Ravi Teja in a movie, Chiranjeevi Ravi Teja film updates, Tollywood, Movies, Entertainment

Ravi Teja in talks for Megastar's Next?: Megastar Chiranjeevi turned a signing spree and the top star lined up several interesting projects. He is done with the shoot of Acharya directed by Koratala Siva and the film releases early next year. The actor is currently shooting for the remake of Lucifer that is titled God Father.

మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో నటించనున్న ఆ స్టార్ హీరో.?

Posted: 09/29/2021 08:19 PM IST
Ravi teja in talks for megastar s next chiranjeevi news

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక చిత్రం షూటింగ్ లో వుండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతూ గతంలో తీసుకున్న గ్యాప్ ను కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 'ఆచార్య' సినిమాను పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత మూడు భారీ సినిమాలు లైన్లో పెట్టేశారు. మోహన్ రాజాతో 'గాడ్ ఫాదర్' సెట్స్ పైకి వెళ్లగా, ఒక సినిమాకి మెహర్ రమేశ్ .. మరో సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్నారు.

మెహర్ రమేశ్ 'బోళా శంకర్' అనే టైటిల్ ను ఖరారు చేయగా, బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి 'వాల్తేర్ వీర్రాజు' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అయితే ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు మాస్ మహారాజా రవితేజ అభిమానులకు కూడా కిక్కిచ్చేలా.. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రవితేజను సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం.

ఈ పాత్రకి  రవితేజ అయితేనే సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయనను గట్టిగానే రిక్వెస్ట్ చేస్తున్నారట. చిరంజీవితో రవితేజకు మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ఆయన సినిమాలైన 'అన్నయ్య' .. 'శంకర్ దాదా జిందాబాద్'  సినిమాల్లో కనిపించాడు. ఆయనని అడుగుతుండటం నిజమే అయితే, ఒప్పుకునే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  Mass Maharaj  Ravi Teja  KS Ravindra  Bobby  Mythri Movie Makers  Tollywood  

Other Articles