మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో వున్న కథలను ఎంచుకుని తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ప్రదర్శింపజేస్తున్న యువనటుడు నాగశౌర్య, కరోనా కారణంగా ఆగిన చిత్రాలను అన్నింటినీ లైన్లోపెట్టిన నాగశౌర్య వరుడు కావలెను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు, దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. ఆ వెంటనే లక్షతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాగశౌర్య.
నాగశౌర్య హీరోగా, కేతిక శర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదల తేదీని అప్పుడే ఫిక్స్ చేసుకుంది. నవంబరు మాసంలో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు ముందుకు నాగశౌర్య తన లక్ష్యతో రానున్నాడు. ‘లక్ష్యసాధనలో గురితప్పిన తన జీవితాన్ని ఓ ఆర్చరీ ఆటగాడు ఎలా సరిదిద్దుకున్నాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్‌దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు.
నవంబర్ 12న సినిమా విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘పార్ధు అనే ఆర్చరీ ప్లేయర్ కథ ఇది. జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపును తెచ్చుకోవాలని అనుకున్న అతడి కలకు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నాగశౌర్య లుక్, నటన ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కోసం విలువిద్యలో ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు’ అని తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more