Tatvamasi: Witness The Euphoria Of Vengeance హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ‘తత్వమసి’

Tatvamasi motion poster witness the euphoria of vengeance

Tatvamasi, Ishan, varalaxmi sharath kumar, prakash raj, harish uthaman, radha krishna, ramana gopi setti, Sam CS, Tollywood, Movies, Entertainment

Ishan who made his debut with Puri Jagannadh’s Rogue will play the lead role alongside Varalaxmi Sarathkumar in an action and revenge drama that will mark directorial debut of writer Ramana Gopisetti. Tatvamasi is the title and the poster looks interesting. Concept-centric motion poster briefs us about the film’s theme.

ఆకట్టుకుంటున్న ‘తత్వమసి’ ఫోస్టర్.. హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్..

Posted: 09/02/2021 01:16 PM IST
Tatvamasi motion poster witness the euphoria of vengeance

కరోనా మహమ్మారి కానీ మరేదైనా కానీ.. ఎంతటి ప్రళయాన్ని సృష్టించినా.. వినోదం పొందేందుకు తెలుగు ప్రేక్షకుడు నిత్యం ముందువరుసలో ఉంటాడు. రెండు ధఫాలుగా కరోనా వైరస్ సినిమారంగంపై భారీ ప్రభావం చూపినా.. ఆ తరువాత తెరుచుకున్న థియేట్లర్లకు ప్రేక్షకుడు వచ్చాడు. చిన్న చిత్రాలు విడుదలైన నేపథ్యంలో వాటిని కూడా ఆదరించాడు. కథ, కథనం.. కొత్తదనం కోసం నిత్యం వెంపర్లాడే ప్రేక్షకుడు తనుకు అనుకున్నది అందిందా.? అన్న కోవలోనే చిత్రాలను ఆదరిస్తాడు.

పాగల్, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలు హిట్ టాక్ సోంతం చేసుకోవడం అందులో భాగమే. అందుకే కొత్త దర్శకులు, నటులు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.  ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడు రమణ గోపిశెట్టి రాసుకున్న కథ ‘తత్వమసి’. ఈ చిత్రం పోస్టర్‌ను గురువారం విడుదల చేస్తామని ఆయన ఇటీవల వెల్లడించారు. ఆయన చెప్పినట్లే విడుదలైన ‘తత్వమసి’ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.

ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, ఇషాన్, రాధాకృష్ణ తదితరులు నటిస్తున్నారు. సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీచక్రం. దాని మధ్యలో ‘తత్వమసి’ అనే అక్షరాలపై ఎర్రని మరకలతో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్ఈఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles