Siddharth Orey Baammardhi Official Trailer ‘ఒరేయ్ బామ్మర్థి’ అంటూ ట్రైలర్ తో వచ్చేస్తున్న సిద్ధార్థ్

Siddharth turns traffic cop in orey bammardi

Siddharth, abhishek films, gv prakash kumar, kashmira pardeshi, Lijomol Jose, maha samudram, orey bammardi, Siddu Kumar, Tollywood, movies, Entertainment

Versatile actor Siddharth is coming before audiences with an action flick titled Orey Bammardi. Siddarth will be seen in the role of traffic cop. Actor GV Prakash Kumar is playing a crucial role in the movie. The trailer that was released on Wednesday has been making enough sound on the social media platforms.

‘ఒరేయ్ బామ్మర్థి’ అంటూ ట్రైలర్ తో వచ్చేస్తున్న సిద్ధార్థ్

Posted: 08/04/2021 06:53 PM IST
Siddharth turns traffic cop in orey bammardi

బాయ్స్ చిత్రంతో తెలుగు చిత్రసీమంలో తెరంగ్రేటం చేసి.. బొమ్మ‌రిల్లు, నువ్వస్తానంటే.. నేనొద్దంటానా వంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కులకు మదికి చేరువైన న‌టుడు సిద్దార్థ్. ఇటు తెలుతో పాటు అటు తమిళంలోనూ పలు చిత్రాలలో నటిస్తున్న ఆయన ఇప్పుడు యువనటుడు శర్వానంద్ తో కలసి మ‌హా స‌ముద్రం చిత్రంలో న‌టిస్తున్నారు. ఇన్నాళ్లు సోలో హీరోగా ఫర్పామెన్స్ ఇచ్చిన తన కెరీర్ కాసింత నెమ్మదించిన నేపథ్యంలో యువహీరోలతో జరకట్టక తప్పడం లేదు. ‘మహా సముద్రం’లో తన పాత్ర విభిన్నంగా, కొత్త‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

అటు త‌మిళంలో జీవీ ప్ర‌కాశ్‌తో క‌లిసి ‘శివప్పు మంజల్ పచ్చై’ సినిమా చేయ‌గా, దీనిని తెలుగులో ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ పేరుతో రూపోందించగా ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్దంగా వుంది. ‘బిచ్చగాడు’కు దర్శకత్వం వహించిన శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా, ఇందులో సిద్దార్థ ట్రాఫిక్ పోలీస్ గా క‌నిపించ‌నున్నాడు .మ‌రో వైపు సిద్ధార్థ్ బామ్మ‌ర్ధిగా జీవీ ప్రకాష్ నటించాడు. ఆయ‌న చిత్రంలో బైక్ రేస‌ర్‌గా అల‌రించ‌నున్నాడు. సిద్దార్థ్ మరియు జీవీ ప్రకాష్ కుమార్ ల మద్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది ఆస‌క్తిక‌రంగా మారింది. వారు చేసిన ప‌నుల వ‌ల్ల ఇద్దరు ఘ‌ర్షణ ప‌డుతుంటారు. అయితే వీరికి మ‌రో కోణం ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉంటుంది. ట్రైల‌ర్‌ని ఆసక్తిక‌రంగా చూపించిన మేక‌ర్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ‘ఒరేయ్ బామ్మర్ది’గా ఆగ‌స్ట్ 13న‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తరువాత వస్తున్న సిద్ధార్థ్ కు ఈ చిత్రమైనా కలిసివస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles