Akkineni Nagarjuna to play key role in Akhil 'Agent' అఖిల్ ‘ఏజెంట్’ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్న నాగ్

Akkineni nagarjuna to play key role in akhil agent movie

Agent, Akkineni Akhil, Akkineni Nagarjuna, Annapurna Studios, Surender Reddy, Sakshi Vaidya, SS Thaman, Tollywood, Movies, Entertainment

Tollywood Young Hero Akhil Akkineni Now Doing AGENT Movie Under Surender Reddy Direction. Akkineni Nagarjuna to play key role in this movie.

అఖిల్ ‘ఏజెంట్’ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్న నాగ్

Posted: 07/15/2021 01:20 PM IST
Akkineni nagarjuna to play key role in akhil agent movie

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా రూపోందుతున్న 'ఏజెంట్' చిత్రంపైనే నాగార్జున అధికంగా దృష్టిసారించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సుంకర రామబ్రహ్మం, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మాస్తున్నారని విషయం తెలిసినా.. ఇందులో కాసింత పెట్టుబడి కూడా అక్కినేని నాగార్జున పెట్టారని టాక్ తాజాగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. పలు చిత్రాల్లో నటించిన అఖిల్ కు ఇప్పటికీ చెప్పుకునేలా ఒక్క హిట్టు దక్కని విషయం తెలిసిందే.

దీంతో అఖిల్ కెరీర్ పైనే దృష్టి సారించిన నాగార్జున.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకాదరణ పోందాలని కోరుకుంటున్నాడు. దానికి తోడు ప్రస్తుత పరిస్థితుల కారణంగా... ఈ సినిమా షూటింగు చాలావరకూ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అయితే అక్కడ ఎన్ని రోజుల పాటు షూటింగు చేసినా, ఆ ఖర్చు అంతా కూడా నాగ్ ఖాతాలోకే వెళ్లనుందట. అంటే అనధికారికంగా నాగార్జున కూడా ఒక నిర్మాతగానే ఉన్నారని చెప్పుకుంటున్నారు.

మొదటి నుంచి కూడా అఖిల్ సినిమా కథాకథనాల విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళుతున్నారు. ఈ సారి తప్పకుండా హిట్ పడాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నారు. అందువల్లనే ఒక వైపున తన సినిమా షూటింగులను చక్కబెడుతూనే, మరో వైపున అఖిల్ 'ఏజెంట్' సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ సినిమా విషయాలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో మలయాళ చిత్రప్రరిశ్రమకు చెందిన అగ్రహీరో పేరు తెరపైకి రాగా, తాజాగా ఆ పాత్రలో అక్కినేనే నటించనున్నారని టాక్ వినబడుతోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agent  Akkineni Akhil  Surender Reddy  Sakshi Vaidya  SS Thaman  Tollywood  

Other Articles