Kim Sharma and Leander Paes in a relationship? స్టార్ తో రోమాన్స్ లో మునిగితేలుతున్న కిమ్ శర్మ

Kim sharma and leander paes loved up pics from goa vacation

Kim Sharma Leander Paes, Kim Sharma Leander paes dating, Kim Sharma Leander paes relationship, Kim Sharma Leander paes Goa Beach, Kim Sharma Leander paes Goa Restaurant, Kim Sharma Leander paes Hugging, Kim Sharma, Leander Paes, dating, relationship, Goa Beach, Goa Restaurant, Bollywood

Actress Kim Sharma and tennis star Leander Paes are currently enjoying a vacation in Goa. The loved-up photo shared by the restaurant features Leander Paes hugging Kim Sharma from behind. Kim and Leander can be seen smiling as they pose for the picture. The cosy picture of the duo have been going viral on social media sparking dating rumours.

స్టార్ తో రోమాన్స్ లో మునిగితేలుతున్న కిమ్ శర్మ

Posted: 07/15/2021 12:19 PM IST
Kim sharma and leander paes loved up pics from goa vacation

తెలుగులో ఖడ్గం, మగధీర చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ కిమ్ శర్మ తాజాగా ఓ స్టార్ తో రోమాన్స్ లో మునిగితేలుతుంది. అయితే ఎవరా స్టార్.. ఏ పరిశ్రమకు చెందిన స్టార్ అనేగా మీ డౌట్.. కానీ ఆయన సినిమా స్టార్ కాదు.. స్పోర్ట్స్ స్టార్. ఔనా.. అయితేనేం ఎవరాయన అంటారా.. అయనే భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌. ప్రస్తతం లియాండర్ పేస్ తో కిమ్‌శర్మ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. మా ప్రేమ సముద్రమంత అని నిర్వచనీయం చెప్పడమే కాదు.. ఈ జంట ప్రస్తుతం సముద్ర తీరన ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి గోవా బీచ్‌లో తిరుగుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి, గతంలోనూ వీరిద్దరూ పలుమార్లు జంటగా కెమెరాకు చిక్కారు. మరోసారి కంటబడడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా వీరు గోవాలోని ఓ హోటల్ లో బస చేశారు. సింగిల్ గా ఉన్న ఫొటోలను పోస్టు చేసిన కిమ్‌శర్మ ‘మిస్టర్ పి’ అంటూ పేస్ పేరును వెల్లడించింది.

కిమ్‌శర్మ 2007లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తోనూ డేటింగ్ చేసింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. కాగా, 2010లో కెన్యా వ్యాపారవేత్తను పెళ్లాడిన కిమ్ 2016లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంతకాలంపాటు నటుడు హర్షవర్ధన్‌రానేతో ప్రేమ కొనసాగింది. ఇప్పుడు లియాండర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, 48 ఏళ్ల మోడల్ రియాతో సహజీవనం చేస్తున్న లియాండర్‌కు ఓ కుమార్తె కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Sharma  Leander Paes  dating  relationship  Goa Beach  Goa Restaurant  Bollywood  

Other Articles