Rajnikanth gets warm welcome by fans in Chennai రజనీకాంత్ కు చెన్నైలో అభిమానుల అత్మీయ స్వాగతం

Rajnikanth gets warm welcome by fans after touching down in chennai from us

Chennai news, Rajnikanth, superstar Rajnikanth, Chennai Airport, Rajnikanth returns, Annaatthe, Annaatthe shooting, fly to the USA, fly to US, leave for US, Rajnikanth, superstar, Chennai Airport, Health check-Up, United States, America, Annaatthe, Kollywood

Superstar Rajinikanth returned to Chennai today after spending three weeks in the US for health checkups. A huge crowd of fans gathered to give him a solid welcome at the airport upon learning of his arrival.

రజనీకాంత్ కు చెన్నైలో అభిమానుల అత్మీయ స్వాగతం

Posted: 07/09/2021 07:32 PM IST
Rajnikanth gets warm welcome by fans after touching down in chennai from us

సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. హెల్త్ చెకప్ కోసం గత నెల 19న ప్రత్యేక అనుమతితో అమెరికాకు వెళ్లారు. 2016 మే నెలలో అమెరికాలో ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా యూఎస్ కు వెళ్లారు. అమెరికాలోని మయో క్లినికల్ ఆసుపత్రిలోని వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. దాదాపు 20 రోజుల తర్వాత రజనీకాంత్ చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రజనీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు ప్రస్తుతం రజనీ 'అన్నాత్తే' సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రజనీ చేయబోయే చిత్రానికి ఆయన కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnikanth  superstar  Chennai Airport  Health check-Up  United States  America  Annaatthe  Kollywood  

Other Articles