Sridevi Soda Center: Mandhuloda Song ‘శ్రీదేవి సోడా సెంటర్’ వద్ద మాస్ సాంగ్ తో సుధీర్ బాబు

Mandhuloda from sudheer babu sridevi soda center out

Sridevi Soda Center, Sudheer Babu, Anandhi, Mani Sharma, Karuna Kumar, Anandhi, Mandhuloda song, Chiranjeevi, Pavel Navageethan, Naresh, Raghubabu, Ajay, Satyam Rajesh, Kasarla Shyam, Sahithi Chaganti, Dhanunjay Seepana, Tollywood, Movies, Entertainment

Megastar Chiranjeevi launched the first single Mandhuloda from upcoming romantic and action drama Sridevi Soda Center in which Sudheer Babu is playing the lead role. Mandhuloda is a good dance number which has folk touch. The song has the music by Mani Sharma

‘శ్రీదేవి సోడా సెంటర్’ వద్ద మాస్ సాంగ్ తో సుధీర్ బాబు

Posted: 07/09/2021 06:29 PM IST
Mandhuloda from sudheer babu sridevi soda center out

తన కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న యువహీరో సుధీర్ బాబు.. చిత్రంలోని పాత్రకు ఇమిడేట్లుగా తన తన వేషధారణతో పాటు బాడీ లాంగ్వేజీని కూడామర్చుకూంటూ ఎంపిక చేసుకున్న చిత్రాల్లోనే నటిస్తున్నారు, తాను మాస్ అడియన్స్ రీచ్ కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకన్న సుధీర్ బాబు.. ఆ మేరకు తన చిత్రంలో అవన్నీ ఉండేట్లు చూసుకుంటున్నాడు. తాజాగా ఆయన మాస్ ప్రేక్షకులలో తన ముద్ర గుర్తిండిపోయేలా చేస్తున్నాడు.

ఇంతకీ అలా ఏం చేశాడా అంటే.. తన తదుపరి చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ చిత్రంలో ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జానపద గీతం ప్రేరణతో ఓ చక్కని మాస్ మసాల పాటను తన చిత్రంలో పొందుపర్చాడు. ఈ పాట కోసం సుధీర్ బాబు కూడా బాగానే కష్టపడ్డాడు. ఆ పాటే ‘మందులోడా.. ఒరి మాయలోడా’. 'పలాసా 1978' సినిమాతో అందరి దృష్టిలో పడిన కరుణకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆనంది అలరించింది. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్షవర్థన్ తదితరులు నటించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. 'మందులోడా’ అంటూ ఈ పాట జోరుగా .. హుషారుగా సాగుతోంది. జానపద బాణీలో మణిశర్మ స్వరపరిచిన ఈ పాట, మాస్ ఆడియన్స్ మనసుదోచేలా ఉంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, సాహితి చాగంటి- ధనుంజయ ఆలపించారు. విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో సుధీర్ బాబు ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi Soda Center  Sudheer Babu  Anandhi  Mani Sharma  Karuna Kumar  Kasarla Shyam  Tollywood  

Other Articles