MAA Elections: It is Mega vs Manchu this time ‘మా’ బరిలో ప్రకాశ్ రాజ్.. మోగా వర్సెస్ మంచు మధ్య వార్

Maa elections prakash raj in race for president post gets nagababu support

Chiranjeevi, Mega vs Manchu, Movie Artists Association, MAA Elections, Nagababu, prakash raj, Manchu Vishnu, Tollywood, Movies, Entertainment, Hyderabad

As the Movie Artists Association (MAA) is gearing up to conduct elections for its official body soon, actors Prakash Raj and Manchu Vishnu have decided to contest for the post of president this time around. The election promises to be a close contest between the two actors as the 800-member association has been divided into two panels supporting each of the contestants running for the top post.

‘మా’ బరిలో ప్రకాశ్ రాజ్.. మోగా వర్సెస్ మంచు మధ్య వార్

Posted: 06/22/2021 08:34 PM IST
Maa elections prakash raj in race for president post gets nagababu support

తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ”ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. మంచు విష్ణు మరో ప్యానెల్ తరపున పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగనుండటం.. ‘మా’ ఎన్నికలపై ఆసక్తి రెట్టింపయ్యింది. మంచు విష్ణూ పోటీలోకి దిగడంతో ‘మా’ ఎన్నికలు ఇప్పుడు మెగా vs మంచుగా మారిపోయాయి. అందుకు కారణం మెగా కుటుంబమే. మా ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా వ్యవహరించే మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానెల్‍కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం.

మరోవైపు మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు పోటీ చేయబోతున్నారు. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పటికే విష్ణు అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో హీట్ కంటే ఎక్కువ హీట్ రెండు ప్యానెళ్ల మధ్య ఉంటుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నాగబాబు.. 2019 ఎలక్షన్స్‌లో నరేష్ ప్యానెల్‌కు సపోర్ట్ చేశారు. శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరకు నరేష్ గెలిచారు.

ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబుకు చిరంజీవికి మధ్య ఉండే స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటువంటి పరిస్థితిలో మంచు విష్ణు, చిరంజీవిని ప్రత్యక్షంగా కలిసి సపోర్ట్ కోరే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే, మంచు విష్ణూకు చిరంజీవి సపోర్ట్ చేస్తారా? తన బ్రదర్ నాగబాబు సపోర్ట్ ఇప్పటికే ప్రకటించిన ప్రకాష్ రాజ్‌కే చిరంజీవి సపోర్ట్ చేస్తారా? అనేది ఆసక్తికరమే. ఫ్రతీ పర్యాయం ఎన్నికల వేళ మాలో రసవత్తర రాజకీయాలకు తెరలేస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ సారి ఎలాంటి ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటాయన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh