Mega powerstar Ram Charan bags another record మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Mega powerstar ram charan bags another record on instagram

Mega powerstar, Ram Charan, ram charan, ram charan new movie, #rc14, #rc15, ram charan instagram, ram charan instagram videos, ram charan instagram id, rrr movie release date, ram charan shankar movie updates, tollywood, Ram Charan Crossed 4 Million Instagram Followers, Movies, Entertainment

Tollywood Hera Mega powerstar Ram Charan bags another record on Instagram as he Crossed 4 Million Instagram Followers. The RRR Hero also crosses the 1.4 million mark on Twitter as well.

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Posted: 06/22/2021 07:27 PM IST
Mega powerstar ram charan bags another record on instagram

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్ట్రాగ్రామ్ లో 4 మిలియన్స్‌(40 లక్షలు) ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. సౌత్‌ నుంచి నాలుగు మిలియన్స్‌ పైగా ఫాలోవర్స్ కొద్ది మంది హీరోలో రామ్‌ చరణ్‌ ఒకటిగా నిలిచాడు. మిగతా యంగ్‌ హీరోలతో పోలిస్తే సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా కనిపించే చెర్రీ.. ఇటీవల చాలా చురుగ్గా పోస్టులు పెడుతున్నాడు. దీంతో పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోవర్స్‌ పెరిగిపోతున్నారు.

ఇక ఇప్పటికే ఆయనకు మరో సామాజిక మాద్యమం అయిన ట్విటర్ లో 1.3 మిలియన్స్‌ మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. దీంతో సినిమాలతో అభిమానులను సంపాదించుకోవడమే కాదు.. తన సోషల్ మీడియాలో అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్యను కూడా పెంచుకుంటూ మోగాపవర్ స్టార్ దూసుకెళ్తున్నాడు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా వున్న ఆయన.. తనకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో ఆయన సతీమణి ఉపాసన కొణిదెల పంచుకునేది.

కానీ గత కొంతకాలం కిత్రం తన తండ్రితో పాటుగా చరణ్ కూడా సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచారు. లేటుగా వచ్చినా లేటెస్టుగా రావడంతో వీరికి తెలుగు ప్రజల నుంచి ఆధారాభిమానలకు కొదవ లేకుండా పోయింది. సోషల్ మీడియాలోని వివిధ ఫ్లాట్ ఫామ్ లలో వీరికి వున్న అకౌంట్లను లక్షలాధి మంది ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం చెర్రీ తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. అలాగే  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Mega powerstar  new Record  Instagram  Twitter  4 million followers  Upasana konidela  Tollywood  

Other Articles