Suresh Babu duped over a fake vaccination drive వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబుకు టోకరా

Producer suresh babu duped of rs 1 lakh by man claiming to sell covid vaccines

Tollywood producer, Producer Suresh Babu, Suresh Productions, fraudster, Nagender Babu, Covid Vaccines, Jubilee Hills Police, Cyberabad police, Cheating case, Rajendra prasad, Tollywood, movies, entertainment, Crime

Tollywood producer Suresh Babu, who is also the managing director of Suresh Productions, was allegedly cheated by a fraudster on the premise that he would be provided vaccines in bulk. The accused was arrested by the Cyberabad police and taken into custody after being booked under Section 420 (Cheating) of the Indian Penal Code (IPC).

వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబుకు టోకరా

Posted: 06/22/2021 06:34 PM IST
Producer suresh babu duped of rs 1 lakh by man claiming to sell covid vaccines

వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబు మేనేజర్ కు లక్ష రూపాయలు టోకరా వేశాడు ఆన్ లైన్ కేటుగాడు. బల్క్ లో వ్యాక్సిన్లు సరఫరా చేస్తానని చెప్పి ఆన్ లైన్ లో లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. డబ్బులు అందినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్ బాబు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌ బాబు ఆఫీస్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆ కేటుగాడు చెప్పిన బూటకపు మాటలు నమ్మి సురేష్ బాబు మేనేజర్ నమ్మి లక్ష రూపాయలు ట్రాన్సఫర్‌ చేశాడు.

కాగా, రీసెంట్‌గా షూటింగ్స్ మొద‌లు కాగా, ప‌లువురు నిర్మాత‌లు త‌మ ద‌గ్గ‌ర ప‌ని చేసే వారికి వ్యాక్సిన్లు ఇప్పిస్తున్నారు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు 200 మందికి వ్యాక్సినేష‌న్ చేయించారు. ఇటీవ‌లి కాలంలో ఆన్‌లైన్‌లో మోసాలు పెరిగిపోయాయి. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేదు.. కేటుగాళ్లు అందరినీ దోచుకుంటున్నారు. సురేష్ బాబు మేనేజర్ మోసపోయిన ఘటన ప్ర‌స్తుతం చర్చ‌నీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles