Acharya is the saviour of the oppressed మెగా ఫ్యాన్స్ కు ‘ఆచార్య’ నుంచి హోలీ కానుక..

Acharya song laahe laahe chiranjeevi s unmatchable swag on the dance floor

Acharya, Acharya Song Laahe Laahe, Acharya lyrical song Teaser, Acharya social drama, Ram charan, Mani Sharma, Koratala Siva, Kajal Aggarwal, Chiranjeevi Konidela, chiranjeevi, Acharya latest updates, Acharya latest news, Acharya first glimpse, Acharya laahe laahe lyrical song, Tollywood, movies, entertainment

Telugu megastar Chiranjeevi to the rescue. The 65-year-old actor features in a teaser of the song Laahe Laahe from his upcoming movie Acharya. The Laahe Laahe teaser offers just a glimpse of Chiranjeevi's sprightly persona when he is on the dance floor.

మెగా ఫ్యాన్స్ కు ‘ఆచార్య’ నుంచి హోలీ కానుక.. కాస్త లేటుగా..

Posted: 03/31/2021 06:08 PM IST
Acharya song laahe laahe chiranjeevi s unmatchable swag on the dance floor

సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య నుంచి మెగా ఫ్యాన్స్ కు కొంచెం ఆలస్యంగా హోలీ పండగ కానుక అందింది. గణతంత్ర దినోత్సం సందర్భంగా వచ్చిన పస్ట్ గ్లింప్స్ టీజర్ తరువాత మరో అప్ డేటే్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను విడుదల చేసిన సినిమా యూనిట్.. మరో నెలన్నర రోజుల్లో చిత్రం (మే 13న) విడుదల కానుందని ప్రకటించినా.. ఇంకా అప్ డేట్స్ కోసం వేచిచూస్తున్నారు. హోలీ పండగ సందర్భంగా ఏదో అప్ డేట్ వస్తుందని చూసినా.. అనౌన్స్ చేసిన.. అభిమానులకు కాసింత ఆలస్యంగా ట్రీట్ ఇచ్చింది సినీయూనిట్.

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం నుంచి లాహే లాహే అంటూ సాగే మొదటి లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవితో పాటు కాజల్‌, సంగీత మెరిశారు. ముఖ్యంగా మణిశర్మ తన మార్కు మెలోడి డ్యాన్సింగ్‌ బీట్స్‌తో మోతెక్కించారు. అరవై ఐదేళ్ల వయస్సులోనూ డాన్స్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగట్టగల నటుడు చిరంజీవే.. ఇక సహజంగానే ఆయన తన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. విజువల్స్‌ చాలా గ్రాండ్‌గా అనిపిస్తున్నాయి. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటను హారిక నారాయణ్‌, సాహితి చాగంటి అద్బుతంగా ఆలపించారు.

కోణిదెల సురేఖ సమర్పణలో తెరకక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో నిర్మాత మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని సంగీత మాంత్రికుడు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని ఈ వేసవిలో మే 13వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles