SS Rajamouli Releases Ram Charan's Alluri look అభినవ అల్లూరికి ఆర్ఆర్ఆర్, ఆచార్య టీమ్ నుంచి సర్ ప్రైజ్.!

Chiranjeevi unveils first look poster of acharya on ram charans birthday

RamCharan, new york bill board, Times square, Acharya, mega star, Chiranjeevi, RRR, vlog, RRR release date, RRR new release date, SS Rajamouli, Jr NTR, Ram Charan, RRR October 13 2021, RRR, ajay devgn, RRR shooting, ajay devgn in RRR, ajay devgn pics, Ram charan, NTR, Tarak, Rajamouli, Tollywood, movies, entertainment

On the 36th birthday of Ram Charan makers of his films are sharing new posters to make his birthday more special, photos and videos of the actor's birthday celebration are all over the internet. However, it has come as a huge surprise to the fans of the actor when photos and videos of New York's iconic Times Square displayed 3D images of the actor on his birthday.

అభినవ అల్లూరికి ఆర్ఆర్ఆర్, ఆచార్య టీమ్ నుంచి సర్ ప్రైజ్.!

Posted: 03/27/2021 10:37 PM IST
Chiranjeevi unveils first look poster of acharya on ram charans birthday

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలుపడంతో అంతర్జాలంలో అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో నిన్ననే ఆర్ఆర్ఆర్ టీమ్ మెగా అభిమానులకు ఓ కానుకను కూడా అందించింది. అభినవ అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ లుక్ ను విడుదల చేసింది. కాగా ఇవాళ ఆర్ఆర్ఆర్ సెట్ లో రాంచరణ్ బర్తడే సెలబ్రేషన్స్ చేసిన వీడియోను పోస్టు చేసింది. జన్మదిన శుభాకాంక్షలు రాంచరణ్ అని చెబుతే గాలిలోకి ఎగిరిన బెలూన్లు ఒక్కక్కటీ ఒక్కక్క మతాబై పేలి అకాశంలో హరివిల్లులా కనువిందుచేసింది. ఈ దృష్యాన్ని దూసిన చరణ్ రాజమౌళి, దానయ్య తదితరులను ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని 'ఆచార్య' సినిమా నుంచి చరణ్ పోషిస్తున్న 'సిద్ద' లుక్‌ని రిలీజ్ చేసింది టీమ్. చరణ్ బర్త్ డే పోస్టర్ గా రిలీజ్ చేసిన ఈ లేటెస్ట్ లుక్‌లో 'సిద్ద' 'ఆచార్య'తో కలిసి ఉండగా మెగా అభిమానుల్లో.. సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేదిగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్‌కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నట్టు సమాచారం. 'ఆచార్య' సినిమా భారీ స్థాయిలో మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్ర మెగాస్టార్‌తో కలిసి స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఈ తాజా పోస్టర్ ని టీట్ చేస్తూ తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు.న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ కు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ భవంతి ఇక్కడే ఉంది. అయితే ఈ భవంతి వద్ద ఏర్పాటు చేసిన బిల్ బోర్డుపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఫొటోలు ప్రదర్శించడం విశేషం అని చెప్పాలి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా టైమ్స్ స్క్వేర్ వద్ద స్లైడ్ షో వేశారని ఉపాసన వెల్లడించారు. ఇదొక మధురమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు. టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై చరణ్ ఫొటోలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోందని, ఇంతటి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. కాగా, టైమ్స్ స్క్వేర్ పై ఈ అరుదైన గౌరవాన్ని పొందిన తొలి సౌతిండియా నటుడు రామ్ చరణ్ కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RamCharan  new york bill board  Times square  Acharya  mega star  Chiranjeevi  RRR  vlog  SS Rajamouli  Jr NTR  Tollywood  

Other Articles